బౌలర్లే విన్నర్లు

Updated By ManamThu, 09/20/2018 - 22:58
rohith
  • కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు  

imageదుబాయ్: ఏమాత్రం బౌలింగ్ స్నేహపూర్వకంగా లేని వాతావరణం లో పాకిస్థాన్ జట్టుపై రాణించిన బౌలర్లను తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. విపరీతమైన వేడి వాతావరణంలో ఫ్లాచ్ పిచ్‌పై భువనేశ్వర్ కుమార్ (3/15), జస్‌ప్రీత్ బుమ్రా (2/23), కేదార్ జాదవ్ (3/23), కుల్‌దీప్ యాదవ్ (1/37) అసాధారణ ప్రతిభ కనబరిచి పాకిస్థాన్ జట్టును 162 పరుగులకు ఆలౌట్ చేశారు. ‘ఆరంభం నుంచి మేము క్రమశిక్షణతో ఆడాం. గత మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. పాకిస్థాన్ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎందుకంటే వాతావరణం బౌలర్లకు ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయం నాకు తెలుసు.

కానీ వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మా పని మేము చేశాం. మా ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాం. గత మ్యాచ్‌లో కంటే మెరుగైన ప్రతిభ కనబరిచాం. స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేసి వికెట్లు సాధించారు. బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు. తొలి 10 ఓవర్లలోనే అసాధారణ ప్రతిభ కనబరిచారు. అలా చేయడం అసాధ్యం. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు కూడా బలమైనదే. అయితే పాక్ బ్యాట్ప్‌మెన్ క్రీజు వద్ద స్థిరపడకూడన్నదే లక్ష్యంగా బరిలోకి దిగాం’ అని రోహిత్ చెప్పాడు. బాబర్ ఆజాం, షోయబ్ మాలిక్ 82 పరుగుల భాగ స్వామ్యం సమ యంలోనూ భయపడవద్దని బౌలర్లకు చెప్పినట్టు రోహిత్ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ 3 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అతని బౌలింగ్‌లో పరుగులు తీసేందుకు పాక్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. ‘అతను (జాదవ్) తన బౌలింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. తనకు ఇచ్చిన బాధ్యతలను ఇప్పుడు ఎల్లప్పుడు బాధ్యతాయుతంగా నిర్విర్తిస్తాడు. చిన్న ఇన్నింగ్స్‌ను ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. ఇక్కడ మేము ఎక్కువగా ఆడలేదు. అయినప్పటికీ ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలో తెలుసుకున్నాం’ అని రోహిత్ చెప్పాడు.

English Title
Bowlers are vinners
Related News