రుణాలు, డిపాజిట్లు రెండూ పెరిగాయి

Updated By ManamFri, 05/25/2018 - 22:20
currency

currencyముంబయి: బ్యాంకులు ఇచ్చిన రుణాలు 2018 మే 11తో ముగిసిన పక్షంలో 12.64 శాతం వృద్ధి చెంది రూ. 85,51,099 కోట్లుగా ఉన్నాయి. అదే 2017 మే 12తో ముగిసిన పక్షంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 75,90,941 కోట్లు గా ఉన్నాయని ఆర్.బి.ఐ డాటా తెలిపింది. 2018 ఏప్రిల్ 27తో ముగిసిన పక్షంలో బ్యాం కుల రుణాలు 12.61 శాతం వృద్ధి చెంది రూ. 85,38,570 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకులిచ్చిన అప్పులు 2017 ఏప్రిల్ 28న ముగిసిన పక్షంలో రూ. 75,82,391 కోట్లుగా మాత్రమే ఉన్నాయి. 2018 మే 11తో ముగిసిన పక్షంలో బ్యాంకుల డిపాజిట్లు కూడా 7.61 శాతం వృద్ధి చెంది 1,13,92,165 కోట్లుగా ఉన్నాయి. బ్యాంకుల వద్ద 2017 మే 12తో ముగిసిన పక్షంలో రూ. 1,05,86, 083 కోట్ల డిపాజిట్లు మాత్రమే ఉన్నాయని ఆర్.బి.ఐ డాటా తెలిపింది. 2018 ఏప్రిల్ 27తో ముగిసిన పక్షంలో డిపాజిట్లు 8.20 శాతం పెరిగి రూ. 1,14,30,786 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మార్చిలో మాదిరిగానే ఈ ఏడాది మార్చిలో కూడా ఆహారేతర రంగానికి బ్యాంకుల రుణాలు పెరిగాయి. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రుణాలు 2018 మార్చిలో 3.8 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల 2017 మార్చిలో 12.4 శాతంగా ఉంది. పరి
శ్రమలకు ఇచ్చిన రుణాలు కూడా 2018 మార్చిలో 0.7 శాతం పెరిగాయి. 

Tags
English Title
Both loans and deposits have increased
Related News