సీఎన్‌ఎన్ కార్యాలయంలో బాంబు కలకలం

CNN

న్యూయార్క్:  ప్రముఖ వార్తా సేకరణ సంస్థ సీఎన్ఎన్ ప్రధాన కార్యాలయం(న్యూయార్క్)లో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. కార్యాలయానికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి బాంబు ఉందని హెచ్చరించడంతో ఎఫ్బీఐ రంగంలోకి దిగింది.వార్తా సంస్థలో ఉన్న ఉద్యోగులందరినీ బయటకు పంపిన అధికారులు విస్త‌‌ృతంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయంలోని అణువణువూ గాలిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అక్టోబర్ నెలలోనూ ఇదే తరహా బంబు కాల్ రాగా, తనిఖీలు చేసిన అధికారులు బాంబును కుగొని నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు