చక్కెర ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Boiler blast, Sugar factory, Karnataka  

బాగల్‌కోట్‌ (కర్ణాటక): నగరంలోని బాగల్ ‌కోట్ జిల్లాలోని ఓ చక్కెర ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. నిరానీ చక్కెర ఫ్యాక్టరీలో బాయిలర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ముధోల్‌ తాలూకాలోని కులాలీలోని గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కూలిన భవనం శిథిలాల నుంచి ఇప్పటివరకూ ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. పేలుడు గల కారణాలు తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

సంబంధిత వార్తలు