సైకిలిస్ట్‌ను కొట్టి రూ.700 నొక్కేశాడు!   

Updated By ManamTue, 11/06/2018 - 17:48
BMW car owner, thrash cyclist, robs Rs700, Pradeep Kumar, Ghaggar bridge

BMW car owner, thrash cyclist, robs Rs700, Pradeep Kumar, Ghaggar bridgeమొహలీ: తన బీఎండబ్ల్యూ కారుకు గీట్లు పడ్డాయనే కోపంతో కారు యజమాని సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కొట్టాడు. అంతటితో ఆగకుండా దూషిస్తూ సైకిలిస్ట్ జేబులో నుంచి రూ.700ను బలవంతంగా లాక్కొన్నాడు. గత అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటన పంజాబ్‌లోని డెరబస్సీలో చోటుచేసుకుంది. బాధితుడు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. డెరబస్సీలోని గోలోమాజ్రా గ్రామ నివాసి అయిన ప్రదీప్ కుమార్ (32) ఓ పని నిమిత్తం తన సైకిల్ మీద ముబార్కపూర్‌కు వెళ్తున్నాడు. ఘాగర్ బ్రిడ్జ్‌కు చేరుకోగానే వెనుక నుంచి దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు (సీహెచ్-04-బి-7778) ఒక్కసారిగా సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారుకు చిన్న గీట్లు పడ్డాయి.

దాంతో బీఎండబ్ల్యూ కారులో నుంచి బయటకు దిగిన యజమాని ఇన్నయితే అగర్వాల్‌ దూషిస్తూ ప్రదీప్‌పై విరుచకుపడ్డాడు. అంతటితో ఆగకుండా సైకిలిస్ట్ ప్రదీప్‌పై చేయి చేసుకోన్నాడు. అతని జేబులో నుంచి రూ.700 తీసుకొన్నాడు. కారు యజమాని తన వాచ్‌ను కూడా బలవంతంగా లాక్కొన్నాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు కూడా తనను ఆపి మరోసారి కొట్టేందుకు యత్నించారని ప్రదీప్ ఆరోపించాడు. మొహలీ ఎస్ఎస్‌పీ కుల్దీప్ సింగ్ చాహల్‌కు ఫిర్యాదు చేసినట్టు కుమార్ తెలిపాడు. నిందితుడు అగర్వాల్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

English Title
BMW car owner thrashes cyclist, robs him of Rs700
Related News