అడ్డుకుంటం

Updated By ManamTue, 10/16/2018 - 06:20
sabarimala
  • వారికి ఆలయప్రవేశం నిషిద్ధం.. ద్వారాలకు అడ్డంగా పడుకుంటం

  • అయ్యప్ప భక్తుల గట్టి నిర్ణయం.. తిరువనంతపురంలో నిరసన

  • రేపు తెరుచుకోనున్న ఆలయం.. కార్యాచరణపై నేడు సమావేశం

sabarimalaతిరువనంతపురం: అనేక మంది మహిళలు.. చిన్న పిల్లలు సహా వేలాది మంది అయ్యప్ప భక్తులు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నెలవారీ కార్యక్రమాల నిమిత్తం ఆలయాన్ని బుధవారం తెరవనుండటంతో.. మహిళలను ఆలయంలోకి అనుమతించేది లేదని అవసరమైతే ప్రవేశ ప్రాంతాల వద్ద తాము అడ్డంగా పడుకుంటామని  నిరసనకారులు చెప్పారు. అయ్యప్ప ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని ‘సేవ్ శబరిమల’ అనే నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు, మూడు నెలల పాటు కొనసాగే మండలం-మకరవిలక్కు (మకరజ్యోతి) సీజన్ నవంబరు 17 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ట్రావన్‌కోర్ దేవస్వొం బోర్డు.. మంగళవారం ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందులో తంత్రి (ప్రధాన అర్చకుడు) కుటుంబం, పాండలం రాజకుటుంబ సభ్యులు, అయ్యప్ప సేవాసంఘం ప్రతినిధులు పాల్గొంటారు. వాళ్లంతా వచ్చి తమ తమ అభిప్రాయాలు చెబుతారని, ఆలయం విషయంలో అన్ని అంశాలపైన తాము తగిన నిర్ణయం తీసుకుంటామని ఆలయ పాలకమండలి అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ తెలిపారు. ఆలయం పునఃప్రారంభం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, మహిళా భక్తుల కోసం మాత్రం ఇంతవరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఏమీ చేయలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేరళలో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోర్టుతీర్పును వ్యతిరేకిస్తుండగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం మాత్రం ఎలాగైనా తీర్పును అమలుచేయాలని ‘తొందర’ పడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. మహిళలను శబరిమల ఆలయంలోకి రానివ్వకుండా ఆపేందుకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేయాలని కూడా కొందరు డిమాండు చేస్తున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఈ అంశాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే ఆందోళన మరింత ఉధృతం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై హెచ్చరించారు. కేరళలో ప్రతి గ్రామస్తుడిని కలిసి.. శబరిమల ఆలయాన్ని, శతాబ్దాల నాటి సంప్రదాయాలు, పరిరక్షించేందుకు భారీ నిరసన ప్రణాళికను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు.

ఆలయానికి వెళ్తా...
అయ్యప్ప ఆలయానికి వెళ్తానని, 18 మెట్లు ఎక్కి పూజ చేసుకుంటానని ఓ మహిళా లెక్చరర్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. రేష్మా నిషాంత్ (32) అనే ఆమె ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే పలువురు భక్తులు ఆమె ఇంటిని చుట్టుముట్టి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి ఆమెను అనుమతించేది లేదని హెచ్చరించారు. తనది విప్లవ ం ఏమీ కాదని, తానొక్కదాన్ని వెళ్లే ధైర్యం చేస్తే ఇంకా చాలామంది తనలాంటి భక్తులు భవిష్యత్తులో వెళ్లే అవకాశం ఉంటుందని ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు. రుతుస్రావం కూడా మూత్రం, మలం లాంటిదేనని, అందువల్ల పూర్తి పవిత్రంగానే తాను ఆలయానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పారు. ఎవరూ తనపై భౌతిక దాడికి దిగలేదని, అయితే ఆలయంలోకి అనుమతించబోమంటూ హెచ్చరిం చారని అన్నారు. గత 12 ఏళ్లుగా తాను మండల కాలం పాటు (41 రోజులు) దీక్ష చేస్తున్నానని, రుతుక్రమం ఉన్న రోజులు మినహాయించి మొత్తం 55 రోజుల దీక్ష చేశానని ఆమె చెప్పారు. నల్లటి దుస్తులు ధరించి, మెడలో అయ్యప్ప మాల వేసుకుని ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. 2006లో తాను పీజీ చేసేటప్పటి నుంచి తనకు ఈ దీక్షలపై ఆసక్తి కలిగిందని చెప్పారు. రేష్మ భర్త నిషాంత్ మాత్రం ఆవెుకు అం డగానే నిలిచారు. ఆమె తరచు ఇంటికి సమీపంలోని ఆలయాలకు వెళ్తుంటారని చెప్పారు.

English Title
Blocked
Related News