చంద్రబాబు, శివాజీపై జీవీఎల్ ఫైర్..

Updated By ManamFri, 09/14/2018 - 19:20
GVL Narasimha Rao, Actor Shivaji, AP CM, Chandrababu Naidu, Non Bailable warrant

GVL Narasimha Rao, Actor Shivaji, AP CM, Chandrababu Naidu, Non Bailable warrant హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీ నటుడు శివాజీపై బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాన్ బెయిలబుల్ వారంటు జారీ కావడంతో చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారని మండిపడ్డారు. చంద్రబాబుని ఏ1, ఏ2 అని పిలుస్తారని భయమా? ఒక దొంగ డ్రామాకు తెరతీశారని జీవీఎల్ విమర్శించారు. దొంగ సింపతీ కోసం బాబు తెగ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. అదొక న్యాయ ప్రక్రియ మాత్రమేనని, న్యాయంనుంచి ఎవరు తప్పించుకోలేరని హితవు పలికారు. చంద్రబాబుపై బీజేపీ కక్ష సాధింపు అవసరం లేదని, ప్రజలే అతనికి బుద్ధి చెప్తారన్నారు. పీడీ అకౌంట్స్ విషయంలో ఎంక్విరీ చేస్తే బాబు అవినీతి బాగోతం అంతా బయటకు వస్తుందని చెప్పారు.

నోటీస్‌లు చూసి బాబు భయపడే రకం కాదని, దాన్ని పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపోరాటం చేయ్యాలి తప్ప.. న్యాయవ్యవస్థపై బురద చల్లడం సరికాదని తెలిపారు. గతంలో 22 నోటీసులు ఇచ్చినా స్పందన లేదని చెప్పారు. అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. అదో న్యాయ ప్రక్రియని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని డ్యూయెట్‌లు పాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ హయాంలోనే చాలా ఇబ్బంది పడ్డారని విమర్శలు గుప్పించారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌పై బాబుకు ఎప్పుడు చిత్త శుద్ధి లేదని, నీటి కోసం పోరాడటం ఏంటి? అని ప్రశ్నించారు. సినీ నటుడు శివాజీకి వేషాలు లేకపోవడం వల్లే ప్యాకేజీ తీసుకొని డ్రామాలు ఆడుతున్నారని జీవీఎల్ మండిపడ్డారు.

English Title
BJP MP GVL Narasimha Rao slams AP CM Chandrababu naidu and Actor Shivaji
Related News