‘సూర్యలత సరే.. లోకేష్ సంగతేంటి..!?’

Updated By ManamFri, 08/10/2018 - 13:14
BJP Leader uma maheswararaju Stright Question To CM Chandrababu Over Lokesh

BJP Leader uma maheswararaju Stright Question To CM Chandrababu Over Lokesh

విజయవాడ: గత కొద్దిరోజులుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని బయటపెడుతూ.. ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబును మొదలుకుని మంత్రుల వరకూ అందర్నీ విమర్శిస్తుండటంతో అంతే రీతిలో తెలుగు తమ్ముళ్లు సైతం కౌంటర్లు పేలుస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఉమామహేశ్వర రాజు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జీవీఎల్‌పై టీడీపీ దాడిని సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీకి ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? అని రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చరిత్ర ప్రజలందరికీ తెలుసు.. మేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. జీవీఎల్ రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న వారు చర్చకు రావాలని ఈ సందర్భంగా ఆయన ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దమ్ముంటే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారాయన.

టీడీపీ బీసీలకు వ్యతిరేకం.. అందుకే దుర్గమ్మ పాలకమండలి సభ్యురాలైన సూర్యలతపై చర్యలు తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. మరి తాంత్రిక పూజల విషయంలో మంత్రి లోకేష్‌పై ఆరోపణలు వచ్చాయి వాటి సంగతేంటి.. అసలు లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని మహేశ్వర్రాజు సూటి ప్రశ్న సంధించారు. తాంత్రిక పూజలు చేసిన ఈఓ సూర్యకుమారికి మాత్రం మంచి పోస్టింగ్ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లోకేష్‌ కోసం తాంత్రిక పూజలు చేయడం వల్ల ఆ నివేదిక ఇంత వరకూ బయటికి రాలేదని అది బయటపెడితే నిజానిజాలేంటో తెలుస్తాయని.. బీజేపీ నేత చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.

English Title
BJP Leader uma maheswararaju Stright Question To CM Chandrababu Over Lokesh
Related News