భిలాయ్ ఫ్యాక్టరీ 14న జాతికి అంకితం

Updated By ManamMon, 06/11/2018 - 22:23
Steel-Authority-of-India-share-

Steel-Authority-of-India-share-న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని  భిలాయ్‌లో ఆధునీకరించిన, విస్తరించిన ‘సెయిల్’ ఉక్కు కర్మాగారాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జాతికి అంకితం చేయనున్నారు. దీనితో ‘సెయిల్’కు చెందిన మూడవ ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకితం చేసినట్లవుతుంది.  ఆయన ఇంతకుముందు 2015లో  రూర్కెలా, ఐ.ఐ.ఎస్.సి.ఓ ఉక్కు కర్మాగారాలను జాతికి అంకితం చేశారు. భిలాయ్‌లో ఉన్నది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అతి పెద్ద ఫ్యాక్టరీ. ఇది అతి పెద్ద పట్టాల ఉత్పత్తిదారుగా,  భారతీయ రైల్వేలకు సరఫరాదారుగా ఉంది. అది 260 మీటర్ల పొడవైన పట్టాలను కూడా అందిస్తోంది. సమీకృత ఉక్కు కర్మాగారాల ఆధునీకరణ, విస్తరణకు ‘సెయిల్’ సుమారు రూ. 70,000 కోట్లతో ఒక పథకాన్ని చేపట్టింది. భిలాయ్ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఆధునీకరణ అనంతరం ఏడాదికి 20 లక్షల టన్నులకు చేరుకుంది. వెడల్పైన భారీ ఉక్కు ఫలకాల తయారీలో, స్ట్రక్చరల్ ఉక్కు ఉత్పత్తిలో కూడా భిలాయ్ ఫ్యాక్టరీ ఖ్యాతికెక్కింది. ఏడాదికి 3.153 మిలియన్ టన్నుల విక్రయించదగిన ఉక్కును అది ఉత్పత్తి చేయగలదు. వైర్ రాడ్లు, మర్చంట్ ప్రాడక్టులు, భూకంప తీవ్రతను తట్టుకోగల తరహా టి.ఎం.టి, దూలాలు తదితర ఉత్పత్తుల తయారీలో కూడా అది ప్రత్యేక నైపుణిని సంతరించుకుంది.

English Title
Bhilai is dedicated to the nation on Factory 14
Related News