బెజోస్ షాకింగ్ ప్రకటన

Jeff Bezos
  • 25 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు

  • విడిపోనున్నట్లు ట్వీట్ చేసిన దంపతులు

  • అవెుజాన్ సీఈవోది ఇక ఒంటరి జీవితం

అమెజాన్ 1994లో ఏర్పాటైంది. ఇది తొలిగా ఆన్‌లైన్‌లో పుస్తకాలు మాత్రమే విక్రయించేది. కంపెనీ ఏర్పాటైన తొలినాళ్లలో మెకంజీ అందులో అకౌంటింగ్ బాధ్యతలు చూసుకునేవారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అలాగే ప్రపంచంలోని అత్యంత విలువైజూ కంపెనీకి ఆయనే చీఫ్‌గా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆయనే జెఫ్ బెజోస్. ఆయన భార్య మెకంజీ. ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉంటారు. రచయిత్రి. వీరిరువురూ విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఇద్దరు ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ తమ జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టులలో కలిసి పనిచేయవచ్చు. అమెజాన్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకంజీ 25 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఆయనకు అమెజాన్‌లో వాటా ఉండటం ఇందుకు కారణం. ఇటీవల ఈ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ను వెనక్కు నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అమెజాన్ స్థాపనలో మెకంజీ అందించిన ప్రోత్సాహం వెలకట్టలేనిదని, ఆమె చాలా సహాయపడ్డారని జెఫ్ బెజోస్ తెలిపారు. కాగా అమెజాన్ 1994లో ఏర్పాటైంది. ఇది తొలిగా ఆన్‌లైన్‌లో పుస్తకాలు విక్రయించేది. కంపెనీ ఏర్పాటైన తొలినాళ్లలో మెకంజీ అందులో అకౌంటింగ్ బాధ్యతలు చూసుకునేవారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అవెుజాన్ విస్తరించింది. అందులో దొరకని వస్తువంటూ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కంపెనీని నడిపిస్తున్న జెఫ్ బెజోస్.. ఇక ఒంటరి జీవితాన్నే గడపనున్నారు. 

Tags

సంబంధిత వార్తలు