బిచ్చగాడు.. కోటీశ్వరుడు!

Updated By ManamThu, 12/21/2017 - 19:29
Bichagadu the Billionaire

Bichagadu the Billionaireన్యూఢిల్లీ: అతడో బిచ్చగాడు. దీన స్థితి. ఓ రోజు ఓ స్వామి అటుగా వెళుతూ అతడి పరిస్థితిని చూశాడు. ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అతడికి భోజన..స్నానాది సపర్యల చేస్తుండగా అందరూ నోరెళ్లబెట్టే విషయం తెలిసింది. అతడు కోటీశ్వరుడన్న షాకింగ్ నిజం తెలిసింది. అతడి ఆస్తి అక్షరాల కోటి ఆరు లక్షల తొంబై రెండు వేల ఏడువందల ముప్పై ఒక్క రూపాయలు. సంఖ్యల్లో చెప్పాలంటే.. రూ.1,06,92,731. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాల్పూర్‌లో జరిగింది. అతడి పేరు ముత్తయ్య నడార్. స్వస్థలం తమిళనాడు. మరి, అతడు అక్కడకు ఎలా వెళ్లాడు? అంత డబ్బు అతడికి ఎక్కడిది? ఆ విషయం అసలు ఎలా తెలిసింది? అతడిని తీసుకెళ్లిన ఆ స్వామీజీ ఎవరు? అంటే.. ఆ కోటీశ్వరుడైన బిచ్చగాడిని గుర్తించింది ఆంగ్రూమ్ స్కూల్‌కు చెందిన స్వామి భాస్కర్ స్వరూప్ జీ మహారాజ్. స్కూల్ పరిసరాల్లో ఆహారం కోసం తచ్చాడుతున్న అతడిని ఆయనే చేరదీశారు. ఆశ్రమానికి తీసుకెళ్లారు. తన శిష్యులతో అతడికి సపర్యలు చేయిస్తుండగా బట్టల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ పేపర్లు, ఆధార్ బయటపడ్డాయి. వాటిని చూసిన స్వామిజీ ఒక్కసారిగా కంగుతిన్నారు. తీరా, అతడి గురించి ఆరా తీస్తే.. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన ఓ వ్యాపారస్థుడని తేలింది. దీంతో ఆ ఆధార్ వివరాల ఆధారంగా ముత్తయ్య కుటుంబ సభ్యులకు అతడి సమాచారాన్ని చేరవేశారు స్వామీజీ. దీంతో తిరునల్వేలి నుంచి ముత్తయ్య కూతురు గీతా రాల్పూర్‌కు వెళ్లారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతడు మతి స్థిమితం కోల్పోయాడని, ఒకరోజు ట్రైన్‌లో వస్తుండగా తప్పిపోయాడని ముత్తయ్య కూతురు గీతా చెప్పింది. తన తండ్రిని తిరిగి అప్పగించినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కాగా, ఇలాంటి బిచ్చగాళ్లను గుర్తించి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిందిగా భాస్కర్ స్వామి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 

English Title
This Beggar A Crorepathi
Related News