జూలైలోగా పూర్తిచేయాలి

Updated By ManamWed, 06/13/2018 - 06:46
harish rao
  • కార్మికుల సంఖ్య పెంచుకోండి.. లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి

  • ‘సుందిళ్ల’ పనులపై సమీక్షలో హరీశ్ రావు

  • రెండో రోజూ ప్రాజెక్టు పనుల పరిశీలన.. రికార్డు సమయంలో పూర్తిచేయాలి

  • ప్యాకేజీ-6 పనుల పర్యవేక్షణ.. ఇకపై ప్రతి వారమూ వస్తానని మంత్రి వెల్లడి

harish raoహైదరాబాద్: జూలై నెలాఖరు కల్లా సుందిళ్ల బ్యారేజీ పనులు పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు అధికారు లకు ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో వేగం పెంచాలని సూచిస్తూ.. అవసరాన్ని బట్టి కార్మికుల సంఖ్యను మరింతగా పెంచుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణం గా పనులు జరుగుతున్న ప్రాంతాలలో పర్యటిస్తూ అధికారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో జోరు వానలోనూ సోమవారం నాడు కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, పంప్ హౌస్, గ్రావిటీ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించిన విషయం తెలిసిందే! తాజాగా మంగళవారంకూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాత్రి వరకు అన్నారం వద్ద సమీక్ష నిర్వహించిన మంత్రి సుందిళ్ల వద్ద బస చేశారు. ఉదయమే కాళేశ్వరం ప్రాజెక్టు గుత్తేదారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు.  కన్నెపల్లి పంప్ హౌస్ పనులకు సంబంధించిన గుత్తేదారులను జులై 15 కల్లా 4 పంప్‌హౌస్‌లు పూర్తిచేయాలని ఆదేశిం చారు.  వీటికి సంబంధించిన మోటార్లు బిగింపు పనులు వేగవంతం చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల హెడ్ రెగ్యులేటర్ల పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు, ట్రాన్సిట్ గేట్ల పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అండర్ స్లూయిజ్ గేట్లను ముందుగా పూర్తి చేయాలన్నారు. పనులన్నీ పూర్తయ్యే వరకు ఇంజనీర్లు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించారు. కార్మికులు, యంత్ర సామగ్రి.. సంఖ్య పెంచి పనులను వేగవంతం చేయాలని కోరారు.

ఆగస్టు కాదు.. జూలైలోనే..
సుందిళ్ల బ్యారేజీ పనులు ఆగష్టు 15 వ తేదీలోగా పూర్తి చేసే ఆలోచనతో ఇంజనీర్లు, గుత్తే దారులు ఉన్నారని మంత్రి హరీశ్ రావు మీడియాకు వెల్లడించారు. అయితే, చెప్పారు. జులై 15 వ తేదీలోగా పనులు పూర్తి చేయలని చెప్పారు. ఈసారి రుతుపవనాలు ముందుగా వస్తున్నాయని, ఎస్సారెస్పీ కడెం ప్రాజెక్టు లోకి ఇప్పటికే నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. ఆ నీరు సుందిళ్ల బ్యారేజీ లోకి వచ్చే అవకా శం ఉందని, అందువల్ల బ్యారేజీ పనులు మరింత వేగంగా పూర్తిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు.. 1200 కార్మికులు పని చేస్తున్నారని, మరో 600 మంది కార్మికులను పెంచి పనుల వేగం పెంచాలని సూచించినట్లు తెలిపారు.  బ్యారే జీకి సంబంధించి 74 గేట్లలో 24 గేట్లు బిగించారని, మరో యాభై గేట్లు బిగించాల్సి ఉందని చెప్పా రు. ప్రతీ రెండు రోజులకు ఒక గేట్ చొప్పున బిగిస్తున్నారన్న మంత్రి హరీశ్ రావు ఈ గేట్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. 11 టీఎంసీల నీటిని నిలుపుకునేలా బ్యారేజీ పనులు వేగంగా పూర్తి చేయాాలని ఇంజనీర్లు, గుత్తేదారులను ఆదేశించానన్నారు. ప్రస్తుతం తొమ్మిది న్నర లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకు గాను లక్షా యాభై క్యూబిక్ మీటర్ల పని పూర్తిచేయాల్సి ఉంద న్నారు. రికార్డు సమయంలో నాణ్యతతో ప్రాజెక్టు పను లు పూర్తి చేస్తామని చెప్పారు. ఎడమ వైపు గైడ్ బండ్  పనులు తొమ్మిదిన్నర కిలోమీటర్లు పూర్తి కావోస్తుందన్నా రు. రివిట్మెంట్ పనులకు కార్మికుల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. కుడి వైపు గైడ్ బండ్  పనులు యాభై శాతం పనులు పూర్తయ్యాయని, మరో యాభై శాతం పనులు మిగిలి ఉందన్నారు. వర్షం వల్ల పనులకు కొంత ఆటంకం కలుగుతుందని ..ఈ సవాల్ ను అధిగమిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్యాకేజి 6 పనులను పరిశీలించిన మంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణలో భాగంగా ధర్మారం మండలం మేడారం గ్రామంలోని ప్యాకేజి 6.. టన్నెల్‌లోని సర్జ్‌పూల్ పనులను పరిశీలించారు. సర్జ్‌పూ ల్ వద్ద అమర్చిన 7 గేట్ల అమరిక పనులను ఆయన పరిశీలించారు. అనంతరం 2 పంపులను జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నారు. ఒక్కో పంప్ ద్వారా రోజుకు 0.27 టీఎంసీ నీటిని పంప్ చేయవచ్చని, దాదాపు 0.54 టీఎంసీని రెండు గేట్ల ద్వారా పంప్ చేయవచ్చని మంత్రి చెప్పారు. విద్యుత్ సరఫరా చేసి డ్రై రన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్యాస్ ఇన్సులేషన్ విద్యుత్ ఉప కేంద్రాన్ని జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని సీమన్స్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

Tags
English Title
To be completed in July
Related News