'బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ'

Updated By ManamThu, 04/26/2018 - 16:56
BC New Party, BCs constitution rule, R krishnaiah

BC New Party, BCs constitution rule, R krishnaiah విజయవాడ: బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ప్రకటిస్తామని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య చెప్పారు. బీసీ సంఘాలతో చర్చించిన అనంతరం త్వరలోనే పార్టీ, విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీసీలను హీనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ.. ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వారిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీసీలకు సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేయలేదని విమర్శించారు. రాజ్యధికారమే లక్ష్యంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తామన్నారు. బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకొనేది లేదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. జనాభా ప్రాతిపాదికన రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

English Title
BCs New Party to be formed target as of BCs constitution rule
Related News