తెలుగులోకి బీసీ నివేదికలు

b s ramulu
  • మండల్, అనంతరామన్, హవనూర్ కమిషన్ల రిపోర్టులు తర్జుమా

  • తొలిప్రతులను గవర్నర్ నరసింహన్‌కు అందజేసిన బీసీ కమిషన్ సభ్యులు

హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా తెలుగులోకి అనువదించి, ప్రచురించిన మండల్ కమిషన్, హవనూర్, అనంతరామన్  ఇంగ్లీషులో ప్రచురించిన బీసీ నోట్‌బుక్ గ్రంధాల తొలి ప్రతులను గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలంగాణ బీసీ కమిషన్ అందజేసింది. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో కమిషన్ చైర్మన్ బిఎస్‌రాములు, వకుళాభరణం కృష్ణమెహన్, అంజనేయులు గౌడ్, జూలూరి గౌరీశంకర్, సభ్య కార్యదర్శి అనితా రాజేంద్ర ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  భారత దేశ సామాజిక నేపథ్యం, ప్రజలకు రిజర్వేషన్ల అవశ్యకతకు గల ప్రామాణికమైన మండల్, అనంతరామ్, హవనూర్ కమిషన్ నివేదికలను తెలుగులోకి తీసుకువచ్చి బీసీ కమిషన్ గొప్ప పని చేసిందని గవర్నర్ అభినందించారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు మూలాధారంగా నిలిచిన ఈనివేదికలను తెలుగులోకి తీసుకురావడం గొప్ప ప్రయత్నమన్నారు. ఈనివేదికల విషయమై బీసీ కమిషన్‌తో పలు అంశాలపై గవర్నర్ చర్చించారు. ఇలాంటి బృహత్కర కార్యాచరణను మున్ముందు కూడా కొనసాగించాలని సూచించారు. దేశంలోనే బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు కారణభూతమైన మండల్ కమిషన్ నివేదిక, రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుకు మూలాధారమైన అనంతరామన్ కమిషన్ రిపోర్టులను, రిజర్వేషన్ల ఉనికికి చిరునామాగా నిలిచిన హవనూర్ కమిషన్ నివేదికలను తెలుగులోకి తేవడం జరిగిందని బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. సమాజంలోని అన్ని  వర్గాల ప్రజలకు, ఇతర వ్యవస్దలకు రిజర్వేషన్ల అవశ్యకత, ప్రయోజనాలు  స్పష్టంగా తెలియజేసేందుకు వీలుగా ఈఅంగ్ల నివేదికలను తెలుగులోకి అనువదించడం , సందర్భోచితంగా విశ్లేషించడం జరిగిందన్నారు. గడిచిన సంవత్సర కాలంగా దేశంలోని  ఆయా రాష్ట్రాలకు  చెందిన బీసీ కమిషన్ నివేదికలను తెలంగాణ బీసీ కమిషన్ క్షుణంగా అధ్యయనం  చేసింద ని వారు వివరించారు.అలాగే బీసీ కమిషన్ గతంలో తెలుగులో ప్రచురించిన బీసీ నోట్ బుక్ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి తెచ్చామన్నారు. ఈగ్రంథాలలో సంగ్రహంగా పీఠికలను చేర్చి సులభంగా ప్రజలకు బోధపడేలా కృషి చేశామని వివరించారు.

Tags

సంబంధిత వార్తలు