యువతి ప్రాణం తీసిన మాక్‌డ్రిల్

Updated By ManamFri, 07/13/2018 - 09:21
logeswari

logeswari చెన్నై: తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరు జిల్లా కోవైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో మాక్‌డ్రిల్ చేస్తుండగా.. ఓ యువతి బిల్డింగ్ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రకృతి వైపరిత్యాలు, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు తమని తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశంపై కాలేజీలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. రెండో అంతస్థు నుంచి దూకి ఎలా ప్రాణాలు రక్షించుకోవాలో చేయించి చూసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలేజీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న లోగేశ్వరి అనే యువతిని బిల్డింగ్‌పైకి ఎక్కించారు. కింద పడితే పట్టుకోవడానికి నెట్ కూడా ఏర్పాటు చేశారు.

అయితే అంత ఎత్తు నుంచి దూకేందుకు లోగేశ్వరి భయపడింది. ఆమె వెనక్కి వెళ్తుంటే కోచ్ ఆర్ముగం ఆమెను కిందకు తోశాడు. ఈ క్రమంలో ఆమె అప్రమత్తంగా లేకపోవడంతో.. కింద ఫ్లోర్ సెల్ఫ్‌కు తల బలంగా తాకి లోగేశ్వరి కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కాలేజీలో విషాదం చోటుచేసుకోగా.. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు భోరున విలపించారు. మరోవైపు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బలవంతంగా లోకేశ్వరిని కిందకు తోసిన కోచ్ ఆర్ముగంను అదుపులోకి తీసుకున్నారు.

English Title
BBA student dies during disaster preparedness drill in college
Related News