బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు

Updated By ManamFri, 08/10/2018 - 01:43
bayyaram steel

imageదేశంలో 10.5% ఉన్న ఆదివాసీ గిరిజనులు దేశ నలు మూలల్లో విస్తరించి ఉన్నారు. ఆంటోనెల్లా కోర్డాన్ కో ఆపరేటివ్ ఫర్ ట్రైబల్ ఇష్యూస్ అనుసారం మేరకు దేశంలో వివిధ రకాలకు చెందిన 5 వేల రకాల గిరి జన తెగలున్నాయని, వీటిలో 70% తెగలు ఆసియా ఖండంలో ఉన్నాయని తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి దేశ మూలాలైన ఆదివాసుల పర్యవేక్షణ కోసం పని చేస్తున్న విభాగం అమెరికాలోని జెనీవా పట్టణంలో 1982లో సమావేశమై ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23, 1994న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆగస్టు 9న అంత ర్జా తీయ ఇండీజినస్ దినోత్సవంగా నిర్వహించాలని అధి కారికంగా ప్రకటించారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రపం చంలోని ఆదివాసుల ఉద్దరణ, వారి హక్కుల పరి రక్షణతో పాటు వారు సాధించిన ప్రగతికి ప్రాచుర్యం కల్పించడం. అంతర్జాతీయ ఆర్థిక ప్రగతికి ప్రాచు ర్యం కల్పించడం, ప్రపంచ దేశాల అంతర్జాతీయ ఆర్థిక అ భివృద్ధిలో తోడ్పడడానికి విశ్లేషణాత్మకమైన సూచన లు, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలను సూచిస్తూ ప్రపంచ దేశాలు వీటి అమలుకు పూనుకో వాలని కోరాయి. మానవ హక్కుల కమిషన్ ఏప్రిల్ 2000లో అంతర్జాతీయ పర్మినెంట్ ఫోరం అన్‌ఇండిజి నస్ ఇష్యూ (యుఎన్‌పిఎఫ్‌ఐఐ) అనే సంస్థ ఉండా లని తీర్మానించగా దీనికి ఎకనామిక్స్, సోషల్ కౌన్సిల్ సమర్థించింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 69వ ప్రతిపాదన ఆదివాసులకు స్వయం ప్రతిపత్తి కలిగిం చాలని, వారి ఆధీనంలో ఉన్న భూములు, వనరులు, అడవిపై వారికి సంపూర్ణ అధికారాలు ఉండాలని సంస్కృతీ, సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా, సామాజిక న్యాయం చోటు చేసుకోకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెబుతుంది. 

గిరిజనుల అభివృద్ధికి ఐక్యరాజ్యసమితి పైన సూ చించిన నిబంధనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరి జనుల హక్కులను పరిరక్షించడానికి జారీ చేసిన జి.ఒ.లను అమలుపర్చకపోవడం దురదృష్టకరం. ఉదాహరణకు 5వ షెడ్యూల్‌లో రాష్ట్ర గవర్నర్ సూచిం చిన ఏజెన్సీ ప్రాంతాలను రాష్ట్రపతి షెడ్యూల్ ఏరి యాలుగా గుర్తించి వాటి పరిరక్షకులుగా రాష్ట్ర గవ ర్నర్‌కి బాధ్యతలు ఇచ్చారు. గిరిజనుల ఆధీనంలో ఉ న్న భూములు అమ్మకాలు, కొనుగోలు చేయ కూడ దు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి నివాస ప్రాంతంలో ఉన్న అటవీ భూములలో ఎలాంటి క్వారీలు కానీ, గనులు కానీ చేపట్టరాదు. ఈ షెడ్యూల్ ప్రాంత ఏరియాలలో ఏదైనా చేర్పులు, మార్పులు జరగాలంటే 1996 షెడ్యూల్ ఏరియా ప్రత్యేక చట్టం ప్రకారం పీసా చట్టం 1/70 (పంచాయత్ ఎక్స్‌టెన్షన్ షెడ్యూల్ ఏరియా) ప్రకారం రాష్ట్రపతికి మాత్రమే ఈ షెడ్యూల్ గ్రామాల కనీస హద్దులను మార్చే హక్కు వుంది. ఆదివాసుల హక్కులకు భంగం కలిగినప్పుడు 5వ షెడ్యూల్ 3వ నిబంధన ప్రకారం గవర్నర్ రాష్ట్ర పతికి నివేదిక ఇవ్వాలి. మన రాష్ట్ర గవర్నర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన గుళ్ళకు మాత్రమే పోతారు. కానీ ఇంతవరకు ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించిన పాపాన పోలేదు. గిరిజ నుల, ఆదివాసుల సంక్షేమానికి కొన్ని వేల కోట్లు కేటా యిస్తున్నా ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆది వాసుల సంక్షేమం కోసం ఆదివాసులను అన్ని రంగా ల్లో అభివృద్ధి చేయటం కోసం ఐటిడిఎ సంస్థని 1975 లో ఖమ్మంలో ఏర్పాటు చేశారు. పాలనా సౌలభ్యం కోసం పాల్వంచకు 17.12.1979లో మార్చారు. ఆది వాసులకు మరింత మెరుగైన పాలన అందించే బాధ్య త ప్రభుత్వాలపై ఉంది. 1991 జనాభా లెక్కల ప్రకా రం ఆదివాసులు 5.60 శాతంగా ఉంది. పి.టి.జి. (ప్రిలిమిటివ్ ట్రైబల్ గ్రూప్) మండలాలు మొత్తం 665 గ్రామాల్లో పి.టి.జి ఆదివాసులు ఉన్నారు. వీరిని అత్యంత ప్రాచీనమైన ఆదివాసీ తెగలుగా గుర్తించారు. ఐటిడిఎ 1991 జనాభా లెక్కల ప్రకారం కోయ 2.31 లక్షలు, లంబాడీలు 1.90 లక్షలు, కొండరెడ్లు 0.10లక్షలు ఉన్నారు.  

ఇక తెలంగాణ బయ్యారం విషయానికి వస్తే విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోంది. దేశంలో మొట్టమొదటి సారిగా పబ్లిక్ రంగ వాటాలు విక్రయించడానికి మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే. ఇప్పటికే ఉన్న పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి శరవేగంగా పరుగులు పెడుతున్న బీజేపీ చట్టం నిర్దేశించిన ప్రభు త్వ ఉక్కు పరిశ్రమల నిర్మాణానికి సిద్ధంగా లేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమను నిర్మాణం చేయటం సాధ్యం కాదని, ప్రస్తుత పరిస్థితులలో అది లాభ దా యకం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ య్యారం పరిశ్రమ నిర్మాణం ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టు వ్యాజ్యంపై 13.06.2018న కేంద్ర ప్రభు త్వం తరఫున కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బయ్యారంతో పాటు కడప ఉక్కు పరిశమ్రల నిర్మా ణం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రాల పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరి శ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందు పర్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రాని ఒప్పించడానికి వారికి పోలవరం ప్రాజెక్ట్ హామీనిచ్చిన కేంద్రం, పోలవరం ప్రాజెక్ట్ కింద నాటి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపునకు గురవుతున్నందున ఖమ్మం జిల్లాకు ఉక్కు పరిశ్రమను ఇస్తామని చట్టంలో చేర్చిం ది. విభజన చట్టం ప్రకారం 13వ క్లాజ్‌లో ఖమ్మం జిల్లాలో 30వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. నాటి యూపీఏ ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లోనే ప్రారంభి స్తామని కూడా అందులో పేర్కొన్నారు. కొంతకాలం నుంచి టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్ కమిటీలను వేస్తూ సర్వే లు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇక మన బంగారు తెలంగాణ ప్రభుత్వం వనరులు సమకూర్చ డం లేదని, కేంద్రం ముందుకు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నాయి. 

బీజేపీ ప్రభుత్వం బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని ఉన్న ఖనిజం కూడా పరిశ్రమకు సరిపోదు అని సాకులు చెప్తూ వస్తున్నది. గత పాల కులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో 1.42 లక్షల ఎకారాల ఖనిజం కలిగిన భూములను అల్లుడు అనిల్ కుమార్‌కి లీజుకి ఇచ్చా రు. ఆదిలాబాద్‌లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. వైఎస్‌ఆర్ మరణానంతరం కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2500 హెక్టార్లు, కరీంనగర్‌లో 3500 హెక్టార్ల భూములను, గూడురు, భూమదేవరపల్లి మండలాల్లో ఉన్న 5300 ఎకరాల పరిధిలోని ఇనుప ఖనిజాన్ని వైజాక్ స్టీల్ ఫ్యాక్టరీకి దారాదత్తం చేశారు. బయ్యారం ఖనిజం పనికిరానిై దెతే ఇంత మంది దేనికోసం పోరాడారు? ప్రైవేటు వాళ్ళకు వైజాక్ స్టీల్ ఫ్యాక్టరీకి పనికివచ్చే బయ్యారం ఖనిజం ఇక్కడ పెట్టే పరిశ్రమకు మాత్రం పనికి రాదా? ఒక పక్కన ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వీరి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కాక, సాగుభూములు లేక, మెట్టభూములల్లో అప్పులు తెచ్చి బోర్‌లు వేసి, నీళ్ళు పడక తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిగ్రీలు, పిజీలు చదివిన యువత ఉద్యోగ, ఉపాధి లేక ఆటోలు నడుపుకుంటూ, హోటళ్ళలో, ఫంక్షన్ హాళ్ళలో సర్వర్‌లుగా దుర్భరమైన జీవితాలు గడుపు తున్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తెలంగాణాకు చట్టబద్దంగా రావాల్సిన ఉక్కు పరిశ్రమపై తెలంగాణ అధికార, ప్రతిపక్షాలు ఉద్యమించాలి. తెలంగాణానే సాధించిన ఘనత తెలంగాణ ప్రజలది. బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం సమరశీల పోరాటం దిశగా ప్రజలు అధిక సంఖ్యలో కదలాలి.

- మన్నారం నాగరాజు
 రాష్ట్ర అధ్యక్షులు,
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ

English Title
bayyaram steel: rite of tribes
Related News