బ్యాటింగ్ వైఫల్యమే కారణం

Updated By ManamTue, 10/16/2018 - 06:20
West-Indies-captain-Jason-Holde
  • వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్

West-Indies-captain-Jason-Holdeహైదరాబాద్: వెస్టిండీస్ ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందంటే ప్రత్యర్థి సవాల్‌ను ఏమాత్రం అందుకోలేని పరిస్థితికి దిగజారింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కు ఇందుకు ఓ ఉదాహరణ. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తే.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకు ఆలౌటైంది. దీనిపై విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎప్పుడైతే మనం స్థాయికి తగ్గట్టు ఆడలేమో అప్పుడు వెనకడుగు వేయాల్సి వస్తుంది. చివరికి అందులో పీకల్లోతులో ఇరుక్కు పోతాం. ఇలా ఎందుకు ప్రతిసారీ కుప్పకూలుతున్నాం అని ఆలోచిస్తే టెక్నికల్ సమస్య కాదని అర్థమైంది. ఒకానొక దశలో ఉత్తమ ఆటను ప్రదర్శించలేకపోతున్నాం. ముఖ్యంగా టెస్టు లంటే ఓపికతో ఆడాల్సిన మ్యాచ్‌లని యువకులు అర్థం చేసుకోవాలి. క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ను నిర్మించుకుంటూ ముందుకు సాగాలి. ఇన్నింగ్స్‌ను నిర్మించమని గొప్ప ఆటగాళ్లందరూ చెబుతుంటారు’ అని హోల్డర్ అన్నాడు.

English Title
Batting failure is the reason
Related News