పెద్ద బతుకమ్మకు బంగారు నాణేలు

Updated By ManamTue, 10/23/2018 - 04:21
bathukamma
  • యూకేలో ఘనంగా ఏడు వారాల బతుకమ్మ

  • ప్రత్యేక పూజలు, ఆటా పాటలు, దాండియా

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఊట్టిపడేలా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రవాస భారతీయులు పెద్ద బతుకమ్మకు బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ ఆధ్వర్యంలో ఈస్ట్ లండన్ డగెన్ హమ్ కేసిల్ గ్రీన్ హాల్‌లో ఏడు వారాల మహా బతుకమ్మ  వేడుకలు ఘనంగా ముగి సాయి. తెలంగాణ సంసృ్కతి ఉట్టిపడేలా బతుకమ్మ పండుగను జరుపుకున్నా మని జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌రావు బలమురి తెలిపారు.

image


   చేనేత కార్మికులకు చేయూత నిస్తూ వారు నేసిన గొల్లభామ చీరలను మహిళలకు కానుకగా ఇచ్చామని తెలిపారు. 60 వరుసలతో పేర్చిన బతుకమ్మకి మొదటి బహుతిగా 5 గ్రాముల బంగారు నాణేలను రెండు, మూ డు బహుమతులు 3గ్రాముల, రెండు గ్రాముల బంగారాన్ని అందజేశారు. ఐదు వరుసలు బతుకమ్మను పేర్చి తెచ్చిన 120 మంది మహిళలకు సిద్ధిపేట నుండి ప్రత్యేకంగ తెచ్చిన గొల్లభామ చీరెలను కానుకగా జాగృతి యూకే కార్యకర్తలు కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి ఉపాధ్యక్షులు పావని గణేష్, సుష్మ జువ్వాడి, శ్రవణ్ కుమార్ , వంశీ తులసి ముఖ్య కార్యదర్శి సంతోష్ ఆకుల, యూత్ వింగ్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి రేపాక, కోశాధికారి రఘు జక్కుల, అడ్వైజరి బృం దం ఉదయ్ నాగరాజు, పావ ని కత్తి, సునీల్ మెహరీర్, తిరుపతి గోలి, బాలగోని వెంకట్, వంశీ సముద్రాల, రాజేష్తో పాటు జాగృతి యూకే కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయానికి కృషి చేశారు.
 

English Title
bathukamma celebrations
Related News