బస్తీ దవాఖానాలు

Updated By ManamFri, 11/09/2018 - 01:46
Basti hospitals

imageజాతీయ పట్టణ ఆరోగ్య పథకం.. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)కింద పట్టణ ప్రాంతాలలోని పేద ప్రజల ఆరోగ్య రక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వివిధ బస్తీలలో నివసించే ప్రజలకు కావల్సిన వైద్యపరమైన అవసరాలన్నింటినీ ఎక్కడికక్కడే అందించడం ద్వారా వారికి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా చూడటమే దీని ప్రధానోద్దేశం. ఖర్చు ఎక్కువ అవుతుందన్న భయంతో చాలామంది పేద ప్రజలు చిన్న చిన్న అనారోగ్యాల నుంచి పెద్ద వ్యాధుల వరకు కూడా పట్టించుకోకుండా అలాగే వదిలేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అందుకే వారికి జేబులోంచి పైసా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుండా వారికి అత్యంత సమీపంలోనే ప్రాథమిక వైద్యసేవలు అందించి, మందులు కూడా ఉచితంగా ఇవ్వాలన్నది ప్రభుత్వ పథకం లక్ష్యం.

ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో సబ్-సెంటర్లు అనేవి ఎక్కడా లేవు. పౌరులు అనారోగ్యం వచ్చినపుడు వైద్య చికిత్సలకుimage వెళ్లాలంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే వారికి అందుబాటులో ఉంటున్నాయి. అందుకోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారు. ఇవి సబ్ సెంటర్ స్థాయిలో పనిచేస్తూ.. మురికివాడలలో ఉండే ప్రజలకు పటిష్ఠమైన వైద్యసేవలు అందిస్తుంటాయి.

చిన్న చిన్న సమస్యలకు అక్కడే చికిత్సలు అందించడంతో పాటు.. సమస్య పెద్దది అనుకుంటే ప్రాథమిక పరీక్షలన్నీ చేసి, దానికి సంబంధించిన రిపోర్టు సిద్ధం చేసి.. పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. తద్వారా వారు ఎక్కడకు వెళ్లాలో కూడా తెలియడంతో వ్యాధి తీవ్రతను బట్టి పెద్ద ఆసుపత్రులకువెళ్లే అవకాశం కూడా క లుగుతుంది. ప్రస్తుతం 28 కమ్యూనిటీ హాళ్లను బస్తీ దవాఖానాలుగా తీర్చిదిద్దారు. తొలి దశలో ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ తీరుతెన్నులను పూర్తిగా పరిశీలించి.. వాటిని మరింత విస్తరించి నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని తలపెడుతున్నారు. 

English Title
Basti hospitals
Related News