బంగ్లాదేశ్‌దే వన్డే సిరీస్

Bangladesh
  • వెస్టిండీస్‌పై మూడో వన్డేలోనూ విజయం 

  • షాయ్ హోప్ సెంచరీ వృథా

సిల్హెట్ (బంగ్లాదేశ్): తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ అర్ధ సెంచరీలు చేయంతో వెస్టిండీస్‌తో శుక్రవారమిక్కడ జరిగిన చివరి వన్డేలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత బంగ్లాదేశ్ 38.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తమీమ్ ఇక్బాల్ 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు సౌమ్య సర్కార్ 81 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టుకు తనవంతు సహకారం అందించాడు. అంతకుముందు వెస్టిండీస్ జట్టులో షాయ్ హోప్ సెంచరీ (108) చేశాడు. అయితే జట్టులోని చాలా మంది సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. దీంతో వెస్టిండీస్‌కు ఓటమి తప్పలేదు. 

Tags

సంబంధిత వార్తలు