తెలంగాణ ఏజీగా శివనంద ప్రసాద్

Updated By ManamFri, 08/10/2018 - 16:51
telangana government logo
telangana logo

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా జనగామకు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది బండ శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఫైలుపై  ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి ఈ ఏడాది మార్చి 6న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రెడ్డి రాజీనామాను ఆమోదించిన తర్వాత బీఎస్ ప్రసాద్‌ను నూతన ఏజీగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 

అయితే తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల బహిష్కరణకు సంబంధించి జరిగిన పరిణామాలే ఆయన రాజీనామాకు కారణమని అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

English Title
Banda Sivananda Prasad is Telangana new Advocate general
Related News