బంగాళాఖాతంలో అల్పపీడనం          

Updated By ManamWed, 07/11/2018 - 23:10
image
  • కోస్తాంధ్రకు వర్ష సూచన

imageవిశాఖపట్నం: ఉత్తర బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికా రులు తెలిపారు. అల్పపీడన ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో కోస్తాం ధ్రలో వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నాటికి అల్పపీడనం బలపడుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

ఈ నెల 14న ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశ ముందన్నారు. మరోపక్క ఒడిశాను కలుపుకొని ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు సీతానగరంలో 6 సెం.మీ, పార్వతీపురం, బాలాజీపేట, చింటూరు, రాజమహేంద్రవరంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం నాడు ఉత్తరాంధ్ర జిల్లాలో పలు చోట్ల చెదురుమదురు వర్షాలు పడ్డాయి. అంతేకాక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

English Title
బంగాళాఖాతంలో అల్పపీడనం          
Related News