బాలయ్య నాకు తెలుసు, హాస్యనటుడు: నాగబాబు

Nagababu

బాలయ్య ఎవరో తనకు తెలీదంటూ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు క్షమాపణలు చెప్పారు. తనకు బాలయ్య ఎవరో తెలుసని, ఫేస్‌బుక్ లైవ్‌లో తెలీదని చెప్పడం తన తప్పని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై తనపై చాలామంది కామెంట్లు చేశారని, అందుకే వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు.

బాలకృష్ణ అంటే పెద్ద నటుడని, అలాగే మంచి హాస్యనటుడని నాగబాబు అన్నారు. ఆయన చేసే హాస్యం చాలా బావుంటుందని, ఎన్టీఆర్‌తో కూడా ఆయన పలు చిత్రాలలో నటించారని చెప్పిన నాగబాబు.. తనకు తెలిసిన బాలయ్య ఇతడేనంటూ వల్లూరి బాలకృష్ణ ఫొటోను చూపించుకున్నారు. కావాలంటే వికిపీడియాలో కూడా ఇతడి గురించి ఉంటుంది అంటూ తనపై వచ్చిన కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించారు.

సంబంధిత వార్తలు