చిన్నారి కోసం...

Updated By ManamWed, 11/07/2018 - 00:29
salman

imageబాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుటారు. చిన్న పిల్లలైతే ఇంకా త్వరగా స్పందిస్తారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి కోరికను సల్మాన్ నెరవేర్చారు. ముంబాయిలోని టాటా మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి సల్మాన్‌కు వీరాభిమాని. ఒకసారి సల్మాన్‌ని కలవాలని ఉందని ఆ బాలుడు తన తల్లికి చెప్పడంతో ఆమె సల్మాన్ మేనేజర్‌కి ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది.

విషయం తెలుసుకున్న సల్మాన్ ఆస్పత్రికి వెళ్ళారు. బాలుడితోపాటు వార్డులో ఉన్న ఇతర చిన్నారులను కూడా పలకరించారు. ఆ సమయంలో తీసిన వీడియోను సల్మాన్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గతంలో తన నివాసం ముందు ఆడుకుంటున్న పేద చిన్నారులకు కొంత డబ్బు ఇచ్చి సల్మాన్ సాయం చేశారు. వారితో పాటు రోడ్డుపై చిందులు వేస్తూ ఎంజాయ్ చేశారు కూడా. ‘బీయింగ్ హ్యూమన్’ పేరిట సల్మాన్ ఓ ఎన్జీవోను స్థాపించారు. ఈ ఎన్జీవో ద్వారా ఎన్నో ఛారిటీలకు విరాళాలు సేకరిస్తున్నారు.

English Title
For baby ...
Related News