అయ్యప్ప అందరివాడేనా?!

Updated By ManamTue, 10/23/2018 - 03:09
ayyappa

imageప్రపంచంలోని అన్ని మతాలకు కొన్ని రకాలైన నియమాలు, కట్టుబాట్లు, ఉంటాయి. ఆస్తికత్వం,  నాస్తికత్వం పక్కనపెడితే చాలా నియమాలు, నిష్టలు  శాస్త్రీయబధ్ధంగా మనిషి ఆరోగ్యానికి, ఆనందానికి వారి మనస్సుకు, వర్చస్సుకు ఏంతో ఉపయోగపడతాయి. దీక్షలు తీసుకోవడంలోని మర్మం  కూడా ఇంతే.. సంవ త్సరంలో ముప్ఫయి  రోజులు లేదా  నలభై రోజులు, రెండు లేదా మూడు నెలలు దీక్ష పేరుతో ఒకపూట  భోజనం చేయడం, లూజ్‌గా వుండే కాటన్ వస్త్రాలను  ధరించడం. ఎక్కువ సమయాన్ని భజనలు, ప్రార్థనల పేరుతో గడపడం, ఎక్కువగా మాట్లాడకుండా నోటిని అదుపులో ఉంచుకోవడం, కోపాలకు, తాపాలకు  దూరంగా వుండి ప్రశాంతమైన మనసుతో వుండటం, చెడు మాట్లాడకపోవడం, చెడు ఆలోచన రాకపోవడం, చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండటం,  వైవాహిక జీవ నానికి  దూరంగా ఉండటం, అందరినీ మర్యాదగా,  ఆప్యాయంగా పలకరించడం, స్త్రీలను గౌరవంగా మాతా అని సంబోధించడం, కటిక నేలపై పడుకో వడం, చెప్పులు లేకుండా అన్ని మార్గాల్లోనూ నడవటంతో పాటుగా దీక్ష తీసుకున్నవారు సాధ్యమై నంత వరకు ఒంటరిగా  ఉండటం వలన  మనిషికి సహజంగానే మంచి నడవడిక అలవాటవుతుంది. భవిశ్యత్ పై ఏకాగ్రత ఏర్పడుతుంది. క్రమశిక్షణ అలవ డుతుంది. మంచి ఆరోగ్యానికి అది మూలస్థంభంగా పనికి వస్తుంది. రంజాన్ మాసంలో ప్రపంచంలోని ప్రతి ముస్లిం కూడా కనీసం ఉమ్మినీరు కూడా మిం గడు. జైన మతస్తులు కేవలం మంచి నీరు మాత్రమే తాగుతూ నలభై రోజులు ఉపవాస  దీక్ష చేస్తుంటారు. కాగా, అయ్యప్ప దీక్షలు చేస్తున్న వారెందరో నలభై రోజులపాటు పవిత్రమైన మనస్సుతో వుంటారు. దీక్షలు అయిపోయిన తరువాత ప్రశాంతమైన మనస్సు తో కనబడతారు. శాస్త్రీయ పరంగా ఇవన్నీ మనిషికి మంచిమార్గాన్ని, మంచి నడవడికను, మంచి దేహాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అలవాట్లు. ఇవన్నీ ఈరోజు పుట్టినవి కావు. 

యాంత్రిక జీవనంలో మనిషి ఎవరి పనుల్లో వారు బిజీగా వున్న ఈ సమయంలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ శబరిమలకు వెళ్లవచ్చును అనే కోర్టు తీర్పుతో  ప్రజల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆందోళనలు మిన్నుముట్టాయి. కేరళ రాష్ట్రం అట్టడుకుతోంది. అక్కడి ప్రజలు శబరిమలలో  మహి ళలకు ప్రవేశం లేదని గట్టిగా చెబుతున్నారు. ఈలోపు కోర్టు తీర్పుతో మహిళలు జూలు విదిలించారు. తమ ప్రతాపాన్ని చూపించాలనుకున్నారు.. యుద్ధానికి బయ లుదేరినట్లుగా ఆలయ దర్శనానికి వెళ్లారు.  తమకేదో కొత్తగా స్వరాజ్యం వచ్చిందనే భావనలో తేలిపోతు న్నారు. తోపులాటలు, పోలీసులు లాఠీచార్జీలు చోటు చేసుకున్నాయి. అయ్యప్ప నామస్మరణతో పులకరించి పోయే శబరి కొండల్లోఅయ్యప్ప నామాన్ని వదిలి మహిళలూ... గో బ్యాక్  అంటూ అయ్యప్ప భక్తులు నినదించాల్సి రావడం దురదృష్టకరం...రోజుల తరబడి చేసిన అయ్యప్ప నామ స్మరణతో నిండిన వారి శరీ రాలు పోలీస్ లాఠీ దెబ్బలతో చిట్లి పోతున్నది. 

నిజానికి, శబరిమల కొండలు భయంకరమైన కీకారణ్యం, అభయారణ్యంతో కూడుకున్న ప్రాంతం.   నెత్తిన బరువైన ఇరుముడిని ఎత్తుకుని రోజుల తరబడి ప్రయాణిస్తూ చివరికి ఎత్తైన 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకోవాల్సిందే. ఆ తరువాత అక్కడున్న కొద్దిపాటి వసతుల్లో గుంపులు గుంపులుగా వచ్చిన భక్తులు చిన్నపాటి గదుల్లో ఆ ఒక్కరోజు నిద్ర చేసి  వీలయితే మరోసారి దర్శనం చేసుకుని మళ్ళీ వందల మైళ్ళు తిరుగు ప్రయాణం చేసి ఇంటికి చేరుకోవా ల్సిందే... ఇదో సంతృప్తి.  ఏడాది కోసారి అయ్యప్ప భక్తులు మనసు నిండా భక్తితో చేసే గొప్ప ఆత్మ శుద్ధి కార్యక్రమం.

ఈ చర్చంతా ఎందుకంటే.. శబరిమల దర్శనం లో ఉన్న ఇబ్బందులన్నీ మహిళలకు సాధ్యపడేవేనా అనే విషయం మనకన్నా ముందుగానే మన పూర్వీకులకు వచ్చి ఉంటుంది. దేవుడి ముందు స్త్రీ పురుష బేధం లేదు.. అందరూ సమానమేకానీ, భీకరమైన అడవుల మధ్య ఎత్తైన కొండల్లో వున్న శబరి గిరీశున్ని దర్శించు కోవాలంటే మహిళలకు సాధ్యం కాకపోవచ్చని విష యాన్నీ బహుశా మన పూర్వీకులు అలోచించి తీసు కున్న నిర్ణయం కావొచ్చును. దట్టమైన అడవుల్లో రోజుల తరబడి పురుషులతో పాటు మహిళలు ప్రయాణించగలరా..? విశ్రాంతికోసం ఆ అడవుల మధ్య మహిళలు గుడారాలు, లేదా చెట్ల కింద పురుషు లతో పాటు వుండగలరా..? నెత్తిన ఇరుముడి బరు వుతో  ఇంటి నుంచి బయలుదేరి కొండలు ఎక్కుతూ  దిగుతూ చెప్పులు లేకుండా రాళ్ళూ రప్పల మధ్య  ప్రయాణిస్తూ కష్టసాధ్యమైన దారిలో ప్రయాణిస్తూ పురుషులతో పాటు  మహిళలు అయ్యప్ప గుడి వరకు వెళ్లగలరా..? పైగా అయ్యప్ప స్వామిని దీక్షలో దర్శించు కోవాలంటే పాటించే నియమనిష్టలన్నీ మహిళలు చేయగలరా?

 ప్రకృతి ప్రకారంగా పురుషుడు శారీరకంగా  మహిళకన్నా బలవంతుడు. అడవుల్లో వేటకు వెళ్లడం, జంతువులతో పోరాడి గెలవడం, యుద్ధాలలో పాల్గొ నడం, కష్టమైన పనులు చేయడం చరిత్ర చెపుతున్న సత్యాలు. అయ్యప్ప స్వామి గుడి కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం... పైగా దీక్షతో మహిళలు అక్కడికి వెళ్లాలంటే కష్టసాధ్యంతో కూడుకున్నట్టిది కాబట్టి మహిళలను ఆ గుడివైపు వెళ్లనీయలేదు. కాలా నుగుణంగా అయ్యప్ప స్వాములు దీక్షకు ప్రాధాన్యం ఇవ్వడం, నియమ నిష్టాచారాలను కఠినంగా పాటిం చడంతో మహిళలు కూడా వారి వారి భర్తలను, కొడు కులను, ప్రోత్సహించడం, పూజా కార్యక్రమాల్లో సహ కరించడం చేస్తున్నారు కానీ మేము కూడా అయ్యప్ప స్వామి వద్దకు వస్తామని అనడం లేదు. 

ఏడాదికోమారు అత్యంత దీక్షాదక్షతతో చేసే శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంలో మా కెందుకీ వివక్ష అని మహిళలు అంటున్నప్పుడు వారు కూడా దీక్షాతత్పరతో వెళితేనే  బాగుంటుంది. అలా జరిగినప్పుడు మిగితా అన్ని గుళ్ళు గోపురాల లాగానే అయ్యప్ప స్వామి కూడా అందరివాడయిపోతాడు.. 

- కన్నోజు మనోహరా చారి 
79950 89083

English Title
ayyappa for all
Related News