మట్టుబెట్టడం మానుకోండి

Updated By ManamSat, 09/22/2018 - 01:13
Murder of dignity

Murder of dignityపరువు హత్యలకు పాల్పడ్డ మారుతీరావు, మనోహరాచారిలతో పోల్చుకుంటే నేను మనిషినే అనిపించింది. ఒక తండ్రిగా నేను పడిన సం ఘర్షణను సమాజానికి చెప్పాలనిపించింది. నాకూ ఒక కూతురుంది. తను ఈ మధ్యనే మతాం తర వివాహం చేసుకున్నది. ఆ సందర్భంలో జరిగిన పరిణామాల నుంచి నేను తేరుకోకముందే సమాజాన్ని ఒక్క సారిగా ఉలిక్కిపాటుకు గురి చేసిన పరువు హత్యలకు పాల్పడ్డ మారుతీరావు, మనోహరాచారి తీరు చూశాక నా అనుభవాన్ని అందరికీ పంచాలని చెబుతున్నా. నేను ఒక తండ్రిగా నా కూతురుని నాకున్న స్థాయిలో అల్లారు ముద్దుగానే పెంచాను. అడి గిందల్లా ఇవ్వకపోయినా నాకున్నంతలో సమకూ ర్చాను. పీజీ వరకు చదివించాను. నా కూతురు నామాట మీరదన్న భరోసాతో పెంచాను. ఒక రోజు పెళ్ళి ప్రస్తావన వచ్చాక కానీ నాకు తెలియలేదు. నా కూతురు మరో మతానికి చెందిన యువకుడిని ఇష్టపడుతుందని. ఏం చెయ్యాలి? మామూలు కుటుంబం. పట్టణ నివాసమైనప్పటి కీ పల్లెటూరి నేపథ్యం కలిగిన కుటుంబం. ఎవ రేమనుకుంటారో? పరువుపోతుందని భయ పడ్డా. సంఘర్షించా.. నువ్వు నాకు నచ్చని పని చేశావు. ఇంట్లో నుంచి వెళ్లిపో.. అన్నాను. తను నేను ఇంట్లో నుంచి వెళ్లిపోను. మీరు వచ్చి మా పెళ్ళి జరిపించాలంది. లేదంటే ఇలాగే ఇంట్లోనే పెళ్ళిలేకుండా ఉండిపోతానంది. కాలానికి ఒది లేశా. 20 నెలలు గడిచాయి. ఇంట్లో ఎవరికీ మ నశ్శాంతి లేదు. యంత్రాల్లా బతికాము. 20 నెలల తరువాత కదిలిస్తే అదే పరిస్థితి. ఏం చెయ్యాలో అర్థంకాని స్థితి. చంపాలనుకున్నా, లేదా నేనే చావాలనుకున్నా, సామ, దాన, భేద, దండోపాయాలన్ని ప్రయోగించాము. కౌన్సెలింగ్ చేయించా. నేను నమ్మే ప్రతిదేవుడ్ని వేడుకు న్నా. నా కూతురు మనుస్సు మార్చాలని కాని మారలేదు. ఏం చెయ్యాలి? చివరికి నేను వెనక్కి తిరిగి ఆలోచించడం మొదలు పెట్టా. నాకూ తురుకు అన్నీ ఇచ్చాను. నన్ను మోసం చేసిం దని కాదు. నా కూతురు ద్వారా నేనేం పొందానో గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాను.

 నా కూతురు ఈ భూమ్మీదకు నేనొస్తానని నన్ను అ డుగ లేదు. నేనే తీసుకొచ్చాను. పుట్టగానే తాను ఏడ్చింది. కాని నన్ను సంతోషపెట్టింది. తాను నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, స్కూ లుకు వెళ్ళినప్పుడు, కొత్తబట్టలు తొడిగిన ప్పుడు, మార్కులు ఎక్కువగా వచ్చినప్పుడు, నీ కూతురు తెలివైంది అని నలుగురు అన్నప్పుడు ప్రతి క్షణం నాలో ఆనందాన్ని నింపింది. కాని ఇప్పుడూ... నాకు ఇష్టం లేని పని చేస్తుంది. ఏది ఏమైనా నా కూతురుతో బంధం వద్దనుకున్న ప్పటికీ నా బాధ్యతను నెరవేర్చాలి. పెంచాను, చదివించాను, కన్నందుకు నా బాధ్యతల్లో మిగి లింది పెళ్లి చేయడం. తను కుటుంబ గౌరవం అనే బాధ్యతను మర్చిపోయింది. చేయని తప్పుకు నా తల్లిదండ్రులు ఈ సమాజం ముందు దోషుల్లా నిలబడుతారని ఆలోచించలేదు. నా కూతురు తన బాధ్యతను మరిచినా నా బాధ్యత నుంచి తప్పించు కోవద్దు. అందుకే నా కూతురు తో నా బంధం కొనసాగినా కొనసాగక పోయినా పరవాలేదు. కానీ కూతురు పెళ్లి బాధ్యతను పూర్తిచేయాలనుకున్నా. అలా నా ఆలోచనా దృక్పథం మార్చుకొన్నాను. అనంతరం నా భార్య తరపు బంధువులను, నా తరపు బంధువులను పిలిచి జరిగింది చెప్పాను. నేను చేసిన ప్రయ త్నాలు వివరించి ఏం చెయ్యాలో చెప్పండని అడిగాను. అంతా ఆలోచించి నా కూతురుకు నచ్చింది చేద్దాం కష్టమైనా, నష్టమై నా తనే బాధ్యురాలవుతుందన్నారు. చంపడమో చావడమో కన్నా  కన్నందుకు మంచిగా బతికితే చాలని అభిప్రాయపడ్డారు. స్నేహితులు, శ్రేయో భిలాషులను పిలిచి వారికీ వివరించా. వారూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. దాంతో నా మిత్రులు, మా అక్కా, బావ, తోడల్లుళ్లు  అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మా నాన్నలతో మాట్లాడారు. వారిని ఒప్పించారు. నాకు ఇష్టం లేకున్నా బాధ్యతగా ఫీలయ్యి పెళ్ళిదాక వెళ్లి అ క్షింతలు వేసి ఆశీర్వదించాను. ఏడ్చాను, బాధ పడ్డాను. నా కూతరు పెళ్ళి గురించి ఎన్నో కలలు కన్న నాకు సాదాసీదాగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఆ పెళ్ళిని చూసి బాధ పడ్డా. ఐనా తండ్రిగా నా పూర్తి బాధ్యతను నేర వేర్చానని సంతృప్తి చెందాను. వాళ్ల దారిన వాళ్ల ను  వెళ్లమన్నాను. తండ్రిగా బాధ్యత నెర వేర్చాను. బంధం ఉంటుందా లేదా అంటే కాలం గాయాన్ని మాన్పితే బంధం కొనసాగు తుంది. లేదా ఎక్కడున్నా వారు బాగుండాలనే కోరుకుంటూ బతికేస్తాం. ఈ క్రమంలో నాకు నా తరపు, నా భార్య తరపు బంధువులు బాసటగా నిలిచారు. నా స్నేహితులు అన్నీ తామై చూసుకున్నారు. నేను అభిమానించే నాయకులు సీతక్క, వేం నరేందర్ రెడ్డిలు నేనున్న స్థితిలో తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మతాలు వేరైనా వివాహం జరిపించేలా నాకు దిశానిర్దేశం చేశారు.  మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యాన్నిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నేను తప్పుడు నిర్ణయం తీసుకోకుండా సహకరించి, నేను మనిషిగా సమాజంలో కొనసాగే అర్హత కల్పించి నందుకు.

‘యుద్ధం చేయడానికి ధైర్యం కావాలి ... హత్య చేయడానికి ఆవేశం చాలు’ సమా జంతో యుద్ధం చేయలేక... ఆవేశంతో హత్య లకు పాల్పడ్డ ఘటనలు చూశాక నాలో ఉన్న కొద్దో గొప్పో ఆత్మ న్యూనతాభావం పోయింది. నేను మనిషినే.. మృగాన్ని కాదు.. అనే ఆత్మ సంతృప్తి కలిగింది. నున్ను గేలిచేసే ఈ సమా జంతో ధైర్యంగా యుద్ధానికి సిద్దమయ్యాను. మనకు ఇష్టంలేని పెళ్ళి చేసుకుంటే వాళ్ళ మానాన వాళ్ళను ఒదిలేయండి. లేకపోతే బాధ్యతను బంధాన్ని రెండింటి నుంచి తప్పుకోండి. అంతే కానీ... ప్రాణాలు తీసేంతో, ప్రాణాలు తీసుకునేటంతో కృరత్వం  తల్లిదండ్రులకు ఉంటుందని సమాజానికి చెప్పకండి. తల్లి దండ్రులారా... తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగానే ఉండని వ్వండి.... రాక్షసత్వం వైపు మళ్లకండి.
 యం. విజయ్ కుమార్
వరంగల్ 

English Title
Avoid tapping
Related News