చ‌రిత్ర తిర‌గ‌రాస్తున్న 'అవెంజ‌ర్స్ - ఇన్ఫినిటీ వార్‌'

Updated By ManamSat, 05/05/2018 - 15:58
avengers

avengers'అవెంజ‌ర్స్‌' (2012), 'అవెంజ‌ర్స్ - ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' (2015) సిరీస్‌లో మూడో చిత్రంగా వచ్చిన 'అవెంజ‌ర్స్ - ఇన్ఫినిటీ వార్‌'.. గత శుక్రవారం (ఏప్రిల్ 27న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగ‌తి తెలిసిందే. థానోస్ లాంటి పవర్ ఫుల్ గ్రహాంతర వాసిని ఎదుర్కోవడానికి కెప్టెన్ అమెరికా, థోర్‌, ఐర‌న్ మ్యాన్‌, బ్లాక్ పాంథ‌ర్‌, స్పైడ‌ర్ మ్యాన్‌, హ‌ల్క్‌ లాంటి సూప‌ర్ హీరోలు చేసిన సాహసాల నేప‌థ్యంలో ఈ యాక్ష‌న్‌ ఎంటర్‌టైనర్ తెర‌కెక్కింది. విడుదలైన రోజునుంచి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ.. కేవలం 11 రోజుల్లోనే $1 బిలియన్ ఫీట్‌ను సాధించే దిశగా పరుగులు తీస్తోంది ఈ చిత్రం. ఈ రికార్డు ఇంతవరకు ‘స్టార్ వార్స్‌ - ద ఫోర్స్ అవేక‌న్స్’ (12 రోజులు) పేరు మీద ఉండగా.. ఇప్పుడు 'అవెంజ‌ర్స్ - ఇన్ఫినిటీ వార్‌' ఈ రికార్డును అధిగమించి అత్యంత వేగంగా $1 బిలియన్‌ను రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించబోతోంది.

English Title
'avengers - infinity war' collections
Related News