రిజర్వేషన్‌ల విషయంలో కోర్టుల వైఖరి మారాలి!

Updated By ManamFri, 07/13/2018 - 01:18
High court

High courtతెలంగాణలోని గ్రామపంచాయతీ ఎన్నిక లల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లను పెంచాలని కోర్టుకు వెళితే రిజర్వేషన్లు యాబై శాతం దాటడానికి వీలు లేదని తీర్పిచ్చింది. గతంలో 2011లో కూడా హైకోర్టు యాబై శాతం మించరాదంటే సుప్రీంకోర్టుకెళ్ళితే 60.19 శాతానికి అనుమతినిచ్చింది. ఈ దేశంలో బీసీలు యాబై శాతం ఉన్నా రనేది వాస్తవం అయినప్పుడు రిజర్వేషనులు జనాభా దామాషా ప్రకారం యాబైశాతం ఉం డాలని బీసీలు ఎందుకు అడుగకూడదు!  యాబై శాతం రిజర్వేషన్ దాటడానికి వీలు లేదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. కానీ కోర్టుకు చట్టానికి భాష్యం చెప్పే అధికారం మాత్రమేవుంది, రిజర్వేషన్‌లు ఎంత వుండా లి అని నిర్ణయించే అధికారం కోర్టుకు లేదు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషనులు ఇంతే వుండాలని రాసిలేదు. మన దేశంలో రిజర్వేషన్లు స్వాతంత్య్రా నికి పూర్వం నుండే వున్నాయి. కొన్ని సంస్థా నాలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్‌లు వున్నాయి. మనం ఒక రాజ్యాం గాన్ని రాసుకున్నాం, అందు లోని ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందిస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగానే రిజర్వేషన్‌లు కల్పిస్తే, 1951లో చంపకం దొరైరాజన్ అనే మ హిళ ఆర్టికల్ 15(1) 29 (2) ప్రకారం కులప్రాతిపదికన రిజ ర్వేషన్‌లు ఇవ్వటం రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టుకు వెళ్ళిం ది, కోర్టు కూడా రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు అని చెప్పింది. దీనితో ప్రభు త్వం ఆర్టికల్ 15కు క్లాజ్ 4ను చేర్చడం జరి గింది. ఈ క్లాజ్‌లో ‘ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించ వచ్చు’ అని రాజ్యాంగబద్ధం చేసింది. మండల్ కమిషన్ అమలు కోసం దేశ వ్యాప్తంగా జరిగిన ఉద్యమంతో, రిజర్వేషన్‌ల విషయంలో కోర్టులు తమకు ముందున్న  వైఖరిని ఇప్పుడు చాలావరకు మార్చుకొన్నా యి. కానీ, రిజర్వేషన్‌లు 50 శాతం దాట రాదు అనే విషయంలో ఇప్పటికీ అదే మాట ను చెపుతూ వస్తుంది, దీన్నే అన్ని రాజకీయ పార్టీలు శిరోధార్యమైనట్లు పాటిస్తున్నాయి. విచిత్రమేమిటంటే, కొంత టీవీ చర్చల్లో పా ల్గొంటున్న రాజకీయ నాయకులు కూడా రా జ్యాంగ రాసినప్పుడే యాబైశాతం వుంది అని అంటున్నారు, ఇది అవగాహనారాహిత్యం. 1963లో బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో 50 శాతానికి రిజర్వేషనులు మించ కుండా వుంటే బాగుటుందని చెప్పింది. ఈ విషయంలో అప్పటి నుంచి కోర్టులు, రాజ కీయ పార్టీలు రిజర్వేషన్‌లు 50 శాతం మించ కూడదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు తిరుగులేదన్నట్లు మాట్లాడుతు న్నారు. కానీ, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ ఎన్.ఎమ్.థామస్ కేసులో జస్టిస్ రే, బేగ్, ముర్తుజా ఫజల్ అలీ, కృష్ణయ్యర్‌లు ‘ఒక రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల జానాభా 80 శాతం వుంటే వాళ్ళకు విద్య, ఉద్యోగాలలో 80 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే అది తప్పవు తుందా’’ అని అన్నారు. అంతేకాదు, వసంత కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో జస్టిస్ చిన్నపరెడ్డి రిజర్వేషన్లకు గరిష్ట పరిమితి నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు ఎవరి చ్చారని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేని విషయాన్ని, కోర్టు తమకు లేని అధి కారాన్ని కల్పించుకొని యాబైశాతం రిజర్వేష న్లు దాటరాదని చెప్పుతున్నారు.  

కోర్టుకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే రిజర్వేషన్లు కులం ప్రకారం వుండాలా లేక సామాజిక, ఆర్థిక వెనుకబాటు ప్రామాణికంగా వుండాలా అనేది. ఎందుకంటే రాజ్యాంగంలో (ఛ్చఛిజు ఠ్చీటఛీ ఛిజ్చూటట్ఛట) వెనుకబడిన వర్గాలు అనింది, కులాలు అన లేదు కాబట్టి కులాన్ని పరిగణనలోకి తీసుకో రాదు అంటున్నాయి కోర్టులు. కానీ, ఈ దేశంలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థి కంగా వెనుకబాటుతనానికి కారణం కులమే! ఈ వాస్తవం కోర్టుకు గమనించడం లేదు, క మొట్టమొదటి రాజ్యాంగ సవరణ సమయం లో డా.బిఆర్.అంబేడ్కర్ ‘వర్గాలు అంటే మరేమీ కాదు కొన్ని కులాలు, కొన్ని మతాలు మాత్రమే’ అన్ని అన్నారు. రెండవది కుల జనగణన లేదు అని, ఇది నిజమే 1931 త ర్వాత దేశవ్యాప్తంగా కుల జనగణన జరగ లేదు. ఈ దేశంలో జనాభాలో బీసీలు యాబై శాతం వున్నారనేది నిజం. యాబై శాతం వున్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అనేది ఎట్లా న్యాయం అవుతుంది? ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొన్ని కులాలు తమను బీసీలలో చేర్చాలని పోరాడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం దేశవ్యాప్తంగా 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కుల జనగణన వివరాలను బయటపెట్టాలి, అదే సమయంలో పెండింగ్ లో వున్న బీసీలను జాతీయ స్థాయి హోదా కల్పించే బిల్లుపాసు చేయించాలి. దీనితో బీసీ లకు యాబై శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగాలలో కల్పించడం ఒక్కటే పరిష్కారం కాగలదు. కోర్టులకు శాసనాలు చేసే అధికారం లేదు, శాసనాలపై వ్యాఖ్యానించటం మాత్రమే కోర్టు బాధ్యత అని, ఈ దేశంలో వెనుకబాటు తనానికి కులమే ప్రామాణికం అని ముందు కోర్టులు అంగీకరించే విధంగా పోరాడాలి. దీనికోసం అన్ని ప్రజా సంఘాలూ, పార్టీలు, కోర్టుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలి. అప్పుడే ముస్లింలు, ఎస్టీలకు, బీసీలకైనా, పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్‌ల సాధన కొరకు మరో అస్థిత్వ ఉద్యమాన్ని నడపాలి, అస్తిత్వ ఉద్యమంలో రిజర్వేషన్‌లు కూడా భాగమే.   
గుండెబోయిన సైదులు యాదవ్
9640794679

Tags
English Title
The attitude of the courts should be changed in case of reservation!
Related News