గెహ్లాట్, పైలట్ ప్రమాణ స్వీకారం

Ashok Gehlot takes oath as the Chief Minister of Rajasthan

జైపూర్ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో అధికారం చేపట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్ సోమవారం ప్రమాణ స్వీకారొం చేశారు. జైపూర్‌లోని చారిత్రక భవనం అల్బర్ట్ హాల్‌లో గవర్నర్ కల్యాణ్ సింగ్...వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవేగౌడ, మల్లిఖార్జున్ ఖర్గే, పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజెతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు