‘హంగ్’పై కేసీఆర్‌తో అసదుద్దీన్ కీలక చర్చ..

Asaduddin Owaisi, KCR, Pragathi Bhavan, TRS, MIM

హైదరాబాద్: తెలంగాణలో అధికారం ఎవరిది అనేది రేపటితో తేలిపోనుంది. కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటనే దానిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లు కీలకం కావడంతో వారిని తమదారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం బైక్‌మీద ప్రగతి భవన్‌కు వెళ్లడం చర్చనీయాంశమైంది. ప్రగతి భవన్‌కు వెళ్లిన అసదుద్దీన్.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మజ్లిస్ టీఆర్ఎస్ పక్షాన ఉంటుందని, జాతి నిర్మాణంలో ఇది తొలి అడుగుగా అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు