జవాన్‌ను ఎత్తుకెళ్లిన తీవ్రవాదులు

Updated By ManamThu, 06/14/2018 - 18:23
Army jawan, abducted in Pulwama, CRPF party 

Army jawan abducted in Pulwamaశ్రీనగర్: రంజాన్ మాసం సందర్భంగా కశ్మీర్‌లో భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పూల్వామా జిల్లాలో జవాన్‌ను తీవ్రవాదులు అపహరించుకొని వెళ్లారు. తీవ్రవాదులు ఎత్తుకెళ్లిన జవాన్ పూంచ్ జిల్లాకు చెందిన ఔరంగజేబు‌గా గుర్తించారు. ఈ ఘటన దక్షిణ కశ్మీర్‌లోని పూల్వామా జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. పూల్వామాలో ఈ రోజు ఉదయం సీఆర్పీఎఫ్ పార్టీ గ్యాంగూ‌పై తీవ్రవాదులు దాడులు చేశారు. గత రెండు రోజుల్లో బందిపొరా, షోపియాన్ జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్ జరిగాయి. జవాన్‌ను తీవ్రవాదులు ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. 

English Title
Army jawan abducted in Pulwama
Related News