ముందస్తు బెయిల్‌కు మురగదాస్ దరఖాస్తు

Updated By ManamFri, 11/09/2018 - 11:33
Murugadoss

Murugadossతమిళనాట ‘సర్కార్’ వివాదం దుమారం రేపుతోంది. విజయ్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా సీన్లు ఉన్నాయని, అలాగే ప్రభుత్వ పథకాలను తక్కువ చేసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అన్నాడీఎంకే కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆ సీన్లను తొలగించాలంటూ సినిమా థియేటర్ల వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మురగదాస్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండగా.. ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 

English Title
AR Murugadoss has applied for anticipatory bail
Related News