పోలీసులు మా ఇంటికి వచ్చారు: మురగదాస్

Updated By ManamFri, 11/09/2018 - 09:55
Murugadoss

Murugadossప్రముఖ దర్శకుడు మురగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు తమిళనాడు పోలీసులు రాత్రి ఆయన ఇంటికి వెళ్లినట్లు వార్తలు రావడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. తాజాగా ఈ వార్తలపై మురగదాస్ స్పందించారు. పొద్దుపోయిన తరువాత తన ఇంటికి పోలీసులు వచ్చారని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘అర్ధరాత్రి దాటా్ మా ఇంటికి పోలీసులు వచ్చి తలుపులను బాగా కొట్టారు. ఆ సమయంలో నేను అక్కడ లేకపోవడంతో కాసేపటికి వెళ్లిపోయారు. ఇప్పుడు నా ఇంటి వద్ద పోలీసులు లేరు’’ అంటూ ఆయన తెలిపారు.

అయితే హీరో విజయ్‌తో మురగదాస్ ‘సర్కార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి తప్పుగా చూపారంటూ అన్నాడీఎంకే నేతలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు మురగదాస్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు మురగదాస్ ఇంటికి పోలీసులు వెళ్లడంపై హీరో విశాల్ స్పందించారు. ‘‘దర్శకుడు మురగదాస్ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్లారు. అక్కడ ఏమీ జరగకూడనిది జరగలేదని భావిస్తున్నా. చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది, ప్రేక్షకులు కూడా చిత్రాన్ని చూసేశారు. అలాంటప్పుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఏంటి’’ అంటూ విశాల్ ప్రశ్నించారు.

 

English Title
AR Murugadoss confirmed that police came to his house
Related News