కన్పార్మ్ చేసిన మురగదాస్

 AR Murugadoss confirmed directing Superstar Rajinikanth new film

రజనీకాంత్ హీరోగా మురగదాస్ కొత్త చిత్రం

చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌ తదుపరి సినిమాకు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని మురగదాస్ అధికారికంగా ధ్రువీకరించాడు. లైకా ప్రొడక్షన్ నిర్మాణ సారధ్యంలో అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది. రజనీకాంత్ సినిమా ఏవిధంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటారో... అదేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్’లా రాజకీయ నేపథ్యంలో కాకుండా ఆ  సినిమా ఫ్యాన్స్‌ అభిరుచి మేరకే ఉండనున్నట్లు సమాచారం.  ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌‌లో రూపుదిద్దుకున్న ‘పెట్టా’ చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించగా, ఆయనకు జోడీగా త్రిష, సిమ్రన్ నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

సంబంధిత వార్తలు