ఏపీ సచివాలయ అధికారులు మృతి

AP secretariat staff killed in a road accident in Kodad

నల్గొండ :  రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏపీ సచివాలయ ఉద్యోగులు సోమవారం దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  వీరు హైదరాబాద్ నుంచి అమరావతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు కోదాడ మండలం దొరకుంట వద్ద అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసేంది. మృతులు ఏపీ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ పీఎస్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ,  ఎలక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్‌వోగా పనిస్తున్న విజయలక్ష్మిగా గుర్తించారు. మరోవైపు గాయపడిన ఇరిగేషన్ ఏఎస్‌వో పాపయ్య, ఏపీ ప్రభుత్వ ఏఎస్ బీ.రఘువీరాంజనేయులు, కారు డ్రైవర్ ఖలీద్ గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. 


కాగా రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగుల మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే హోంమంత్రి చినరాజప్ప కూడా ప్రమాదం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు