ఏపీ ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలు విడుదల

Updated By ManamSat, 05/12/2018 - 14:48
AP ICET 2018 Result, Sri Venkateswara University

AP ICET 2018 Result, Sri Venkateswara Universityవిజయవాడ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఈ ఏడాది ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ నెల 2న ఐసెట్-2018 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. ఐసెట్‌లో 92.60శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు. జూన్‌ 20వ తేదీ నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐసెట్‌లో టాప్‌ పది ర్యాంకర్లలో మొదటి ర్యాంక్‌ గుంటూరుకు చెందిన చింతగుంట్ల ప్రసన్న పవన్‌కుమార్‌కి రాగా, రెండో ర్యాంక్‌ అనంతపురానికి చెందిన భరత్‌కుమార్‌కు వచ్చింది. ఏపీ ఐసెట్-2018 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in/icet లో చూడవచ్చు.

English Title
AP ICET 2018 Results released Today
Related News