ముంచుకొస్తున్న పెథాయ్.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Pethai

అమరావతి: నాలుగు రోజుల క్రితం అల్పపీడన రూపంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ పెథాయ్ ముంచుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో నేటి సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపై పెథాయ్ ప్రభావం ఎక్కువగా ఉండగా.. ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలను చేపట్టారు.

సహాయకచర్యల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండగా.. 25 డ్రోన్లతో బృందాలను ఏర్పాటు చేశారు. తుపాన్ నేపథ్యంలో విద్యుత్ నిలిచిపోయే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పునరుద్ధరణకు ముందస్తు చర్యలను చేపట్టారు. వేగంగా వీచే గాలులకు విద్యుత్ స్తంబాలు నేలకొరిగే అవకాశం ఉన్నందున 50 నుంచి 70వేల స్తంభాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పెథాయ్‌పై ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు