ప్రకాశ్ రాజ్‌తో అనుపమకు గొడవ నిజమేనా..?

Updated By ManamThu, 07/12/2018 - 13:28
Prakash Raj

Prakash Raj, Anupamaతన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్న కేరళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్‌పై ఇంతవరకు ఎలాంటి రూమర్లు రాలేదు. అయితే ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం షూటింగ్‌లో ఆమెకు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌కు గొడవలు వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్‌లో ప్రకాశ్ రాజ్, అనుపమను తిట్టాడని అందుకు ఆమె బాధపడుతూ కుప్పకూలిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ సమయంలో దర్శకుడు త్రినాథరావు కలగజేసుకొని వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడని ఇలా రకరకాల మాటలు వినిపించాయి. 

అయితే వీటికి తెరదించుతూ ప్రకాశ్ రాజ్‌తో తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుపమ. అంతేకాకుండా ఆ వార్తలన్నీ అబద్ధాలు అంటూ ఓ స్టేట్‌మెంట్‌ను కూడా ఇచ్చేసింది. కాగా ప్రేమకథగా తెరకెక్కుతున్న హలో గురు ప్రేమ కోసమే అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 

English Title
Anupama denies rumours that she fainted after being scoled by Prakash Raj
Related News