టీడీపీకి రాజీనామా చేసిన మరో కీలక నేత

Updated By ManamTue, 08/07/2018 - 13:17
Ramesh Naidu

Ramesh Naidu అమరావతి: ఏపీలో అధికార టీడీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, కృష్ణ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ రమేశ్ నాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపినట్లు ఆయన వెల్లడించారు. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నా సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని, అందుకే రాజీనామా చేశానని రమేశ్ నాయుడు అన్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా తాను వివిధ స్థాయిలో పనిచేశానని గుర్తుచేసిన రమేశ్.. పార్టీకి అంకితభావంతో సేవలను అందించినా, తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తన అనుచరులతో చర్చింది దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని రమేశ్ పేర్కొన్నారు.

English Title
Another senior resign for TDP
Related News