మరో హారర్ చిత్రంలో...

Updated By ManamSun, 06/24/2018 - 06:56
nandita

image‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో నిఖిల్‌తో నటించి మెప్పించింది నందితా శ్వేత. ఈ హీరోయిన్ ఇప్పుడు నితిన్‌తో శ్రీనివాస కల్యాణం సినిమాలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం మరో తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నందితా శ్వేత. ఆ సినిమాయే ‘ప్రేమకథా చిత్రమ్ 2’. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇద్దరు హీరోయిన్స్‌లో ఓ హీరోయిన్‌గా ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ది ఇద్నాని నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా నందితా శ్వేత జాయిన్ కానుంది. వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే నందిత తమిళంలో ఏడేళ్ల పిల్లవాడికి తల్లి పాత్రలో నటిస్తుంది.  ఇప్పుడు నందిత తెలుగులో చేయబోయేది మూడో చిత్రమే. అయితే అందులో రెండు చిత్రాలు హారర్ నేపథ్యాలవే కావడం గమనార్హం.

English Title
In another horror movie ...
Related News