గుడ్డుతో మధుమేహుల్లో గుండెజబ్బులకు చెక్!

Updated By ManamMon, 05/07/2018 - 18:56
Eggs, risk of cardiovascular disease, Type-2 diabetes

Eggs, risk of cardiovascular disease, Type-2 diabetes వెబ్ ప్రత్యేకం: గుడ్డు తినాలంటే దాదాపు అందరూ ఇష్టపడతారు. గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం.. తిననివారు కూడా లోట్టలేసుకుంటూ గుటుక్కమని గుడ్లు మీద గుడ్లు మింగేస్తారు. గుడ్లు తిననివారి కంటే గుడ్లు తినేవారిలో గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందంట. ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో కూడా గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు గుడ్డు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేశారు. పరిశోధకుల అధ్యయనంలో వారానికి 12 గుడ్లు చొప్పున ఏడాదిపాటు తినడం ద్వారా మధుమేహం, టైప్-2 మధుమేహంతో బాధపడేవాళ్లలో గుండెజబ్బులతో వచ్చే ప్రమాదం తగ్గుతుందని గుర్తించారు. ఈ అధ్యయానికి సంబంధించి కథనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పరిశోధన సంస్థ ప్రచురించింది. మూడు నెలల క్రితం జరిపిన అధ్యయనంలో కూడా ఇటువంటి ఫలితాలే వెల్లడి కావడంతో పరిశోధనను పొడిగించారు. పరిశోధన ప్రారంభంలో పాల్గొన్న వారికి గరిష్ఠంగా వారానికి (12 గుడ్లు చొప్పున), కనిష్ఠంగా వారానికి ( 2 కంటే తక్కువ గుడ్లు) తినేలా డైట్ పాటించారు.

మూడు నెలలు చివరి రోజుల్లో గుడ్లు తిన్నవారిలో హృదయరోగ సంబంధిత వ్యాధులకు కారణమైయ్యే ప్రమాద కారకాలను గుర్తించలేదు. పరిశోధనలో పాల్గొన్న ఒక గ్రూపుకు గుడ్లు తక్కువ, ఎక్కువ మొత్తంలో ఇస్తూనే.. మరో గ్రూపుకు బరువు తగ్గేలా డైట్‌ ఫుడ్‌ను ఇస్తూ మొత్తం మూడు నెలలు అదనంగా ఇచ్చారు. ఇందులో పాల్గొన్న మరో గ్రూపుకు మిగతా ఆరునెలలు నుంచి 12 నెలల పాటు అదే మోతాదులో గుడ్లను తినేలా సూచించారు. అన్ని దశల్లో రెండు గ్రూపుల్లో గుండెజబ్బులకు సంబంధించి ఎలాంటి ప్రతికూల మార్పులు కనిపించలేదని, బరువు తగ్గే డైట్ చేసినవారితో సమానంగా గుడ్డు తిన్నవారు కూడా బరువు తగ్గినట్టు గుర్తించినట్టు సిడ్నీ యూనివర్సిటీ నిక్ ఫుల్లర్ పేర్కొన్నారు. గుడ్లు తీసుకోవడం వల్ల అందులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని వెల్లడించారు. దీనివల్ల ముఖ్యంగా కళ్లు, గుండె ఆరోగ్యం, రక్తనాళాలు, ఆరోగ్యకరమైన గర్భాలకు కూడా ఎంతో మేలు కలుగుతుందని ఫుల్లర్ తెలిపారు.

English Title
Ande ka funda: Eggs do not increase risk of cardiovascular disease in Type-2 diabetes
Related News