‘ఎఫ్‌ 2’లో హాట్ యాంకర్ స్పెషల్ సాంగ్

Anasuya

వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్ 2’. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. అందులో భాగంగా స్పెషల్ సాంగ్‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సాంగ్‌లో హాట్ యాంకర్ అనసూయ కాసేపు కనిపించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో తెలిపాడు.

ఎఫ్2లో అనసూయ ఒక అతిథి పాత్రలో, అలాగే ఒక పాటలో కనిపించనుందని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. దిల్ రాజు నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి.

సంబంధిత వార్తలు