అభినవ

Updated By ManamFri, 06/08/2018 - 01:15
image

 Abhay Navaకలలు మాత్రమే కనేవారు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటారు. ఆ కలలను సాకారం చేసుకోవాలనుకునే వారు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడితమ కలలను సాకారం చేసుకుంటారు అలాంటి కోవకు  చెందిన వారిలో సృష్టి బుదోరి ఒకరు...
ప్ర. మీ కుటుంబ నేపథ్యం, బాల్యం గూర్చి చెప్పండి?
జ.  మా కుటుంబమంతా నార్త్ ఇండియా వారే, నాన్నగారిది  ఉత్తరాఖండ్, అమ్మది ఉత్తరప్రదేశ్  వారి ఉద్యోగరీత్య 2008లో హైదరాబాద్‌లో స్థిరపడిపో యారు. నా చిన్నతనం నుంచే హైదరాబాద్‌లో ఉంటున్నాను. నాన్న ఆర్మిలో కల్నల్‌గా చేస్తూ ప్రమోషన్‌లో భాగంగా ఇతర రాష్ట్రాలకు బదిలిపై వెళ్లిపోయినా, అమ్మ మాత్రం నాచదువు, తమ్ముని చదువు కోసం ఇక్కడే ఉండిపోయింది. అమ్మ ఆయుర్వేద డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. నాకు చిన్నప్పటి నుంచే నాట్యమంటే చాలా ఇష్టం   ఎక్కడైనా పాటలు విని పించి నపు డు వాటిని అనుకరిస్తూ కాళ్లు,   చేతులు కదిపేదాన్ని. అమ్మా నాన్న  నా ఆసక్తిని గమనించి ఐదేళ్ల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ స్కూల్లో చేర్పించారు.

ప్ర. అంత చిన్న వయస్సులో  డ్యాన్స్ క్లాస్‌లకి వెళ్లడం కష్టమయ్యేదా?
జ. నా గురువులు మంజు రామస్వామి, రామ్మూర్తి గార్లు నన్ను చాలా బాగా చూసుకునేవారు. కానీ నాట్యం ప్రాక్టీసు చేసేటప్పుడు చాలా  కఠినంగా ఉండేవారు. నాకు ఆ వయసులో ఇటు స్కూలుకి, అటు డాన్స్ క్లాసులకి  వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఒక్కోసారి వెళ్లనని ఏడ్చే దాన్ని, కాని అమ్మ నాకోసం చాక్లెట్లు, బొమ్మలు, ఐస్‌క్రీంలు ఇచ్చేది. అలా వాటికోసమైనా వెళ్లేదాన్ని. నేను 8వ తరగతిలోకి వచ్చే సరికి నృత్యంపై మంచి అభిప్రాయంతో పాటు,  ఇష్టం  కూడా పెరిగింది.  

ప్ర. నృత్యం, చదువు రెండింటిలో ఏది ఇష్టం?
జ.  నాట్యం, చదువు రెండింటికి నా జీవితంలో సమ ప్రాధాన్యత ఉంది. రెండింటిలో ఏది ఇష్టమో చెప్పడం కష్టం. నేను పదో తరగతిలోకి అడుగుపెట్టిన కూడా చదువును, నృత్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు. చివరి పరిక్షలకు మాత్రం ఒక నెల సమయాన్ని కేటాయించి డ్యాన్స్ క్లాసులకి వెళ్లలేదు. ఎం.బీ.బీ.ఎస్ చేయాలన్నది నా చిన్ననాటి కల నాఆశయాన్ని చేరుకోవడానికి నాట్యం, అలాగే నాట్య కళాకారిణిగా నన్ను నేను నిరూపించుకోవడానికి   చదువు నాకు ఎప్పుడూ ఆటంకం కాలేదు. 

ప్ర. మీ మొదటి ప్రదర్శన ఎప్పుడు, ఎక్కడ ఇచ్చారు?
జ.నా మొదటి ప్రదర్శన 2000 ల సంవత్సరం ఏప్రిల్‌లో ఇచ్చాను. మా గురువుగారు సెంటిమెంట్‌గా తన శిష్యుల తొలి ప్రదర్శనను గుడిలో చేయించారు. నా అరంగేట్రం అల్వాల్‌లోని రాముని గుడిలో చేశాను. అప్పటి నుంచి శ్రీరాముని ఆశీస్సులతో ప్రదర్శనలిస్తూ ఈ స్థాయికి వచ్చాను.

ప్ర.ఫిలిప్పీన్స్‌లో ఎం.బీ.బీ.ఎస్ చేస్తూ, రవీంద్రభారతిలో ప్రదర్శనలివ్వడం ఎలా సాధ్యమైంది?
జ.ఇండియాలో మెడిసిన్ చదివేవారికి వేసవి సెలవులుండవు. కానీ ఫిలిప్పిన్స్‌లో ఒకటి, రెండు నెలలు వేసవి సెలవులు, క్రిస్టమస్‌కు కూడా ఎక్కువ రోజులే ఇస్తారు. ఆ సమయంలో నేను ఇండియా వచ్చి ప్రదర్శనలిస్తాను. అప్పుడు నాట్యానికే నా సమయాన్నంతా కేటాయిస్తాను. సెలవుల సమయంలో నాట్య ప్రదర్శనలతో సంతోషంగా   గడుపుతాను.

ప్ర. భవిష్యత్తులో డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచనేమైనా ఉందా?
జ.ఆలోచనైతే ఉంది, అమ్మకి ఎప్పుడూ చెబుతుంటాను డ్యాన్స్ స్కూల్ పెట్టాలని. నా గురువులు నాకు నేర్పిన విద్యను పదిమందికి పంచాలనేది నాకోరిక. ప్రస్తుతం చదువుతో పాటు, నాట్య ప్రదర్శనలతో బిజీగా ఉన్నాను. భరతనాట్యంలో పి.హెచ్.డి చేయాలన్నది నా ఆశ, దాని తరువాత భరతనాట్యం ఇస్టిట్యూట్‌ని హైదరాబాద్‌లో నెలకొల్పాలని ఉంది.
- ఎ.యమున

Tags
English Title
Amine
Related News