సమతా మార్గమే అంబేద్కర్ ఆశయం

Ambedkar

హైదరాబాద్:  భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న  డా.బాబా సా హెబ్ అంబేద్కర్ 63వ వర్దంతి మనువాదుల రాజ్యవ్య తిరేక పోరాట దివస్‌గా పాటిస్తూ ట్యాంక్‌బండ్ అంబే ద్కర్ విగ్రహానికి దళిత బహుజన పార్టీ  అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ ఘనంగా నివాళ్లు అర్పించారు. గురువారం ఆపార్టీ ఆధ్వర్యంలో వర్దంతి వేడుకలు అట్ట హాసంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడు తూ  భారత దేశానికి  ప్రపంచ పటంలో ఒక స్దానం కల్పించడానికి తన జీవితాన్నే ఈదేశ ప్రజల కోసం ప్రధానంగా దళిత బహాజనుల మానవ హక్కుల కోసం త్యాగ చేసిన మహోన్నత శక్తి అంబేద్కర్‌ని కొని యాడారు.  ఆయన రూపొందించిన  రాజ్యాంగ ద్వా రా ఈదేశానికి  దశ-దిశ చూపారని, ఆశయాలను ఆగ్ర కుల మనువాద పాలకులు కాలరాస్తున్నారని, రాజ్యాం గాన్ని నాశనం చేస్తున్నారని, భారతదేశం ,రాజ్యాంగం, మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయని తీవ్రంగా ఆరోపించారు. స్వేచ్చ, సమతారాజ్యం కోసం అణగారి న కులాల ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం, సామా జిక న్యాయం సాధించాలంటే స్వతంత్య్రమైన  దళిత బహుజనుల నేతృత్వంలో రాజ్యాధికారం సాధించడం ద్వారానే సామాజిక విముక్తి వస్తుందన్నారు. ఓటు అనే ఆయుధంతో రాజకీయపోరు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గౌరవ ప్రదమైన  జీవన కోసం  అంబేద్కర్ చూపిన సమతా మార్గంలో నడవటమే మనం బాబాసాహెబ్‌కు ఇచ్చే నిజమైన నివాళ్లలని స్ప ష్టం చేశారు. ఈకార్యక్రమంలో పార్టీ తెలంగాణ కార్య దర్శి చేపూరి రాజు, గ్రేటర్ నాయకులు నారోజ్ కల్పన,  కొప్పల్లి రమేష్, మాల మహానాడు నాయకులు వి.ఎల్ రాజు, అర్షల రాజు, నామా రమేష్, దేవేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.

బహుజనులకు రాజ్యాధికారమే అంబేద్కర్ లక్ష్యం
హైదరాబాద్‌లోని టీడీపీ, బహుజన లెఫ్ట్ ఫ్రంటు కార్యాలయాల్లో గురువారం అంబేద్కర్ 62 వర్థంతి కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించబడి, సమసమాజ దేశం ఏర్పడ్డమే అంబేద్కర్ ఆశయమన్నారు. బహుజ నులకు రాజ్యాధికారం అందించడమే అంబేద్కర్‌కు అసలైన నివాళి అని పలువురు నాయకులు పేర్కొ న్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం నిర్మిస్తామని కేసీఆర్ శంకుస్థాపన చేశారని బీఎల్‌ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ గుర్తుచేశారు. నేటికీ దానికి అతీగతిలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

Tags

సంబంధిత వార్తలు