రిటైల్ రంగంలోకి అమెజాన్

Updated By ManamFri, 11/09/2018 - 22:33
amazon
  • భారీగా పెట్టుబడులు

amazonన్యూఢిల్లీ: ఈ కామర్స్  దిగ్గజం అమెజాన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలను వేస్తోంది. ఈ క్రమంలో   ఈ రిటైల్ రంగంలో పెట్టుబడులు పెట్లాలని భావిస్తున్నటుల ప్రకటించింది. దేశంలోని పలు రిటైల్ దిగ్గజాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 14న బోర్డు ఆమోదం పొందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిచవచ్చని మార్కెట్ వార్గాలు చెబుతున్నాయి. దేశీయంగా పలు రిటైల్ అవుట్ లెట్లు కలిగిన బిగ్ బజార్, నీలగిరి సూపర్ మార్కెట్లలో 9.5శాతం వాటాలను కొనుగోలుకు అమెజాన్ రంగం సిద్ధం చేసుకుంది. ఈ డీల్ మొత్తం విలువ రు. 2,500 కోట్లుగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై స్పందించిన ఫ్యూచర్స్ గ్రూప్ తమకు దాదాపు దేశం మొత్తం మీద 1,100 స్టోర్లు ఉన్నాయని తెలపింది. దీనికి  సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా సిద్ధమయ్యాయని, బోర్డ్ ఆమోదం ఒక్కటే మిగిలి ఉందని ఫ్యూచర్స్ రిటైల్స్ వర్గాలు తెలిపాయి. అలాగే అమెజాన్ ఆదిత్య బిర్లా రిటైల్స్ లో కూడా విట్ జిగ్ ఎడ్వైజరీస్, సహారా క్యాపిటల్ సంస్థలతో  కలిసి పెట్టుబడులను సమకూర్చుకుంది. దీంతోపాటు అమెజాన్ భారత దేశంలో సుమారు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. 500 మిలియన్ డాలర్లతో దేశీయంగా ఫుడ్,  ప్రాసెసింగ్ విభాగాల్లో పెట్టబడులకు భారత ప్రభుత్వం అనుమతి లభించిందని అమెజాన్ తెలిపింది. 

Tags
English Title
Amazon to retail
Related News