ఇక నా వల్ల కాదు..

Updated By ManamSun, 10/21/2018 - 05:59
payal rajput

‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సినిమాలో ముద్దు సీన్లలో నటించింది కాబట్టి తదుపరి సినిమాల్లో కూడా అదే కొనసాగిస్తుం దనుకోవడం పొరపాటే. ఆ విషయంలో పాయల్ చాలా క్లారిటీతో ఉంది. అన్ని సినిమాల్లోనూ అలాంటి సన్నివేశాల్లో నటించాలంటే తనవల్ల కాదంటోంది. ‘‘ఇప్పుడు తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి.

image


పంజాబీలో కూడా కొన్ని సినిమాలు చేయబోతున్నాను. ఈ రెండు భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను కాబట్టి జర్నీ ఎక్కువైంది. అయితే నాకు హైదరాబాద్ బాగా నచ్చింది. భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాల క్యారెక్టర్స్ బాగున్నాయి. అయితే పవర్‌ఫుల్ రోల్స్, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అంటే నాకు ఇష్టం. ‘హీరోయిన్’ సినిమాలో కరీనా కపూర్ చేసిన తరహా క్యారెక్టర్ చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలోనే ఉంది కాబట్టి భవిష్యత్తులో అలాంటి క్యారెక్టర్స్ వస్తాయని ఆశిస్తున్నాను’’ అంటోంది పాయల్. 

English Title
am not going to do like that characters
Related News