సూర్య చిత్రం నుంచి తప్పుకున్న మెగా హీరో

Updated By ManamSat, 07/21/2018 - 09:18
suriya, Sirish

Surita, Sirish సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర మొదటి షెడ్యూల్ కూడా పూర్తైంది. కాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విలన్‌గా కనిపించనుండగా.. అల్లు శిరీశ్ మరో కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి అల్లు శిరీశ్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపాడు.

ప్రస్తుతం శిరీశ్ మలయాళ చిత్రం ఏబీసీడీ రీమేక్‌లో నటిస్తుండగా.. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడం వలనే సూర్య మూవీ నుంచి తప్పుకున్నట్లు శిరీశ్ చెప్పాడు. ఇక ఈ విషయాన్ని దర్శకుడు కేవీ ఆనంద్‌కు వివరించానని, ఆయన కూడా తన నిర్ణయానికి ఓకే చెప్పాడని శిరీశ్ తెలిపాడు. అయితే భవిష్యత్‌లో ఈ టీంతో పనిచేసే అవకాశం కోసం వస్తుందని భావిస్తున్నట్లు అల్లు శిరీశ్ పేర్కొన్నాడు. కాగా శిరీశ్ స్థానంలో కోలీవుడ్ నటుడు ఆర్య నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

English Title
Allu Sirish opts out from Suriya 37
Related News