దేవరకొండ కోసం మరోసారి బన్నీ

Updated By ManamFri, 11/09/2018 - 12:37
Taxiwaala
Taxiwaala

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 11న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చింది. 

అయితే విజయ్ దేవరకొండ కోసం అల్లు అర్జున్ అతిథిగా రావడం ఇది రెండోసారి. అంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా బన్నీ వచ్చాడు. గీత గోవిందం, టాక్సీవాలా రెండు చిత్రాలు గీతా ఆర్ట్స్‌ 2లోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. 

English Title
Allu Arjun is chief guest for Vijay Devarakonda's Taxiwaala
Related News