నీటి సంరక్షణ బాధ్యత అందరిదీ

Updated By ManamThu, 05/17/2018 - 23:19
babu
  • రాష్ట్ర ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం ఇదే.. చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్

  • ప్రజల సమస్యలను తీర్చడంలో ముందంజ.. ప్రకాశంజిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు

babu-2ఒంగోలు: నీటి సంరక్షణ బాధ్యత ప్రజలందరిదీనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీటికోసం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గురువారం ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. వలేటివారిపాలెం మండలం పోకూరులో ‘నీరు- ప్రగతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కందు కూరు ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. గొట్టివాటి కొండవాటు కాలువ పూర్తిచేసి కందుకూరు ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చా రు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు వూరు చెరువులో క్రేన్ సహాయంతో స్వయంగా పూడిక తీశారు. రైతులతో స మావేశమై మాట్లాడారు. నూక వరం గ్రామంలోని ఎస్సీ కాల నీలో స్థానికులతో మాట్లాడా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్గమధ్యం లో అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. బడేవారిపాలెంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం ఇచ్చిన బడేబారిపాలెం గ్రామస్థులను ఆయన అభినందించారు. ప్రజల సమస్యల్ని తీర్చడంలో తమ ప్రభుత్వం ముందం జలో ఉందన్నారు. పిల్లలు, తల్లిదండ్రులను చూడకపోతే తాను పెద్దకొడుకుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అన్ని పనులు ఆన్‌లైన్లో పెట్టి పారదర్శక పాలన అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 

సత్ప్రవర్తనకు మార్గదర్శనం 
రంజాన్ ఎంతో పవిత్రమాసమని, నెలరోజులు ఎంతో నిష్టగా చేసే దీక్షలకు చాలా ప్రాధాన్యముందని  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముస్లింలకు ఆయన రంజాన్ మాస ప్రారంభదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. ముస్లింలు ఈ నెల రోజులూ ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడుపుతారని అన్నారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్ అనే ఐదు  అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమే రంజాన్ మాసమని చంద్రబాబు పేర్కొన్నారు. అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం, దయాగుణం, దానగుణం కలిగి ఉండటం సత్ప్రవర్తనకు మార్గాలని, భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయని అన్నారు. ఇవే లక్షణాలు అలవర్చుకుని, జీవితమంతా కొనసాగించేందుకు రంజాన్ స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ( 2018-19) రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రూ. 1101.90 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని 4304 మసీదుల్లో ఇమామ్‌లు, మౌజన్‌లకు వరుసగా రూ.5000, రూ.3000 గౌరవ పారితోషికం ఇవ్వడానికి వీలుగా 2016-17లో రూ. 32 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2018-19 బడ్జెట్‌లో రూ.75 కోట్లు కేటాయించామని తెలిపారు. రంజాన్ సందర్భంగా మసీదుల సుందరీకరణకు, ఇఫ్తార్‌లకు ఈ ఏడాది రూ.5 కోట్లు విడుదల చేశామని చంద్రబాబు వెల్లడించారు.

English Title
All responsible for water conservation
Related News