కన్నడ కదనం: గవర్నర్ మనసులో ఏముంది? 

Updated By ManamWed, 05/16/2018 - 18:41
Karnataka Game Of Politics

All eyes now on Karnataka governor Vajubhai Vala as the BJP veteran takes his time

బెంగళూరు: కర్ణాటక రాజకీయం ఇప్పుడు గవర్నర్ వజుభాయ్ వాలా చుట్టూ తిరుగుతోంది. గవర్నర్ మనసులో ఏముందో ఎవరికీ తెలియట్లేదు..! బలనిరూపణ చేసుకోండనే మాట ఆయన నోటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఓ వైపు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప.. మరోవైపు జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి వేయికళ్లతో వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు గవర్నర్‌రు కలిశారు. ఎమ్మెల్యేలంతా బస్సులో వచ్చి గవర్నర్‌ను కలవడం జరిగింది. సుమారు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలపై చర్చించడం జరిగింది. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి గవర్నర్ నుంచి ఎటువంటి హామీ లభించక పోవడం గమనార్హం. కాగా గవర్నర్ న్యాయ నిపుణులను సంప్రదించి కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గవర్నర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ ఎటూ తేల్చకపోవడంపై జేడీఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి లోనై రాజ్‌భవన్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

గవర్నర్‌కు అన్నీ చెప్పాం..!
భేటీ అనంతరం పీసీసీ చీఫ్ పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్‌కు మద్దతిచ్చేందుకు ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని తాము గవర్నర్‌కు నిశితంగా వివరించడం జరిగిందన్నారు. నాగాలాండ్, గోవా, మణిపూర్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో తీసుకున్నట్లుగానే, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు పరమేశ్వర స్పష్టం చేశారు.
 
కుమార స్వామి మాట్లడుతూ..
ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన సంఖ్యాబలం మాకుందని ఇదే విషయాన్ని గవర్నర్‌కు చెప్పామన్నారు. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ గవర్నర్‌కు సమర్పించామన్నారు.కాంగ్రెస్, జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీల సమావేశాలు జరిగాయన్నారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను  ఇరు పార్టీల ప్రతినిథి బృందం గవర్నర్ వజుభాయ్ తెలిపినట్లు చెప్పారు. తనకు మద్దతుగా కాంగ్రెస్ ఇచ్చిన లేఖను కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు గతంలో అవకాశం ఇచ్చారని, సుప్రీంకోర్టు కూడా ఇందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్న విషయాన్ని కుమారస్వామి గుర్తు చేశారు. 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్‌కు లేఖ సమర్పించామన్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా సరైన నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసిస్తున్నామని, ఆయన రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని నమ్ముతున్నామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. మరికొద్దిసేపట్లో గవర్నర్‌ను యడ్యూరప్ప కలవనున్నారు. గవర్నర్ నిర్ణయం తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉంది. అయితే ఈ వ్యవహారం మొత్తం పూర్తయ్యే సరికి మరో వారం రోజులు పట్టే అవకాశముందని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా ప్రస్తుత కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా.. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్‌గా పనిచేశారు.

 

All eyes now on Karnataka governor Vajubhai Vala as the BJP veteran takes his time

English Title
All eyes now on Karnataka governor Vajubhai Vala as the BJP veteran takes his time
Related News